Thandel Meaning: తండేల్ అంటే ఏంటి? ప్రపంచానికి తెలిసేది అప్పుడే.. ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్-meaning of thandel naga chaitanya sai pallavi movie thandel trailer to reveal tomorrow 28th january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel Meaning: తండేల్ అంటే ఏంటి? ప్రపంచానికి తెలిసేది అప్పుడే.. ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్

Thandel Meaning: తండేల్ అంటే ఏంటి? ప్రపంచానికి తెలిసేది అప్పుడే.. ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్

Hari Prasad S HT Telugu
Jan 27, 2025 07:16 PM IST

Thandel Trailer Prelude: తండేల్ అంటే ఏంటి? ఈ సందేహం చాలా మందికి ఉంది. దీనికి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు మూవీ మేకర్స్. తండేల్ ట్రైలర్ లాంచ్ మంగళవారం (జనవరి 28) జరగనుండగా.. అప్పుడే దీనికి అర్థమేంటో రివీల్ చేయనున్నారు.

తండేల్ అంటే ఏంటి? ప్రపంచానికి తెలిసేది అప్పుడే.. ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్
తండేల్ అంటే ఏంటి? ప్రపంచానికి తెలిసేది అప్పుడే.. ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్

Thandel Trailer Prelude: తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ కు అంతా సిద్ధమైంది. సోమవారం (జనవరి 27) ఈ సినిమా ట్రైలర్ గ్లింప్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మేకర్స్.. ట్రైలర్ ను మంగళవారం రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. అదే సమయంలో ఎంతో మందిని వేధిస్తున్న ప్రశ్న అసలు తండేల్ అంటే ఏంటి అన్నదానికి కూడా సమాధానం చెప్పబోతున్నారు.

yearly horoscope entry point

తండేల్ అంటే ఏంటి?

నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆఫ్ 2025 తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ చేయడం ద్వారా మేకర్స్ మూవీ ప్రమోషన్లను మొదలుపెట్టగా.. మంగళవారం (జనవరి 28) ట్రైలర్ కూడా రాబోతోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లోని రామా టాకీస్ రోడ్ లో ఉన్న శ్రీరామా పిక్చర్ ప్యాలెస్ లో జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం అవుతుంది.

అంతకుముందు సోమవారం ట్రైలర్ ప్రెల్యూడ్ పేరుతో ఓ చిన్న గ్లింప్స్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ వీడియోలో.. "ఈ పండగ నుండి రాజుగానే మన తండేల్" అని బ్యాక్‌గ్రౌండ్లో ఓ వాయిస్ వినిపిస్తుంది. తండేల్ అంటే అంటూ మరో వాయిస్ దానికి అర్థమేంటో అడుగుతుంది. ప్రపంచానికి జనవరి 28 సాయంత్రం 6.03 గంటలకు తెలుస్తుందంటూ ఈ ట్రైలర్ గ్లింప్స్ వీడియోను ముగించారు.

ఈ గ్లింప్స్ లో నాగ చైతన్య చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. అసలు తండేల్ అంటే ఓ ఓడకు నాయకుడు అనే అర్థం అన్నట్లుగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే చాలా వార్తలు వచ్చాయి. అయితే దీనికి ఇప్పుడు మేకర్సే అధికారికంగా సమాధానం చెప్పబోతున్నారు.

తండేల్ సాంగ్స్ బ్లాక్‌బస్టర్

మరోవైపు తండేల్ మూవీ నుంచి ఇప్పటికే మూడు పాటలు రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటలన్నింటికీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూడింటికీ కలిపి 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు కూడా మేకర్స్ సోమవారమే వెల్లడించారు.

అందులో బుజ్జి తల్లి పాటకే 57 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం విశేషం. అటు ఈ మధ్యే హైలెస్సో హైలెస్సా అనే మరో సాంగ్ కూడా వచ్చింది. ఈ లవ్ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ లో నంబర్ 1 ట్రెండింగ్ సాంగ్ గా ఉంది. ఇప్పటికే ఈ పాటకు 6.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది కూడా మెలోడీ సాంగే. ఇక మూడు వారాల కిందట తండేల్ సెకండ్ సింగిల్ గా వచ్చిన నమో నమ: శివాయ సాంగ్ కు ఇప్పటి వరకూ 8.2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.

తండేల్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మిగిలిన భాషలన్నీ కలిపి ఈ మూడు పాటలకు వచ్చిన వ్యూస్ 100 మిలియన్ల మార్క్ దాటింది. మరిన్ని చార్ట్‌బస్టర్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయని మేకర్స్ చెప్పడం చూస్తుంటే.. తండేల్ రిలీజ్ కు ముందే పెద్ద మ్యూజిక్ హిట్ అయ్యేలా ఉంది. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Whats_app_banner