Mazaka TV Premiere Date: టీవీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ కామెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?-mazaka tv premiere date sundeep kishan movie to telecast on zee telugu on 20th april ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mazaka Tv Premiere Date: టీవీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ కామెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Mazaka TV Premiere Date: టీవీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ కామెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

Mazaka TV Premiere Date: సందీప్ కిషన్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. తాజాగా జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

టీవీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ కామెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Mazaka TV Premiere Date: జీ తెలుగు ఛానెల్లోకి వచ్చేస్తోంది సందీప్ కిషన్ రొమాంటిక్ కామెడీ మూవీ మజాకా. థియేటర్లలో రిలీజైన రెండు నెలల్లోనే ఈ సినిమా టీవీ ప్రీమియర్ కానుండటం విశేషం. ఈ మూవీ వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని సోమవారం (ఏప్రిల్ 14) తన ఎక్స్ అకౌంట్ ద్వారా జీ తెలుగు వెల్లడించింది.

మజాకా టీవీ ప్రీమియర్ డేట్

సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షులాంటి వాళ్లు నటించిన మూవీ మజాకా. ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరు సక్సెస్ సాధించింది. తర్వాత మార్చి 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక ఇప్పుడు టీవీలోకి కూడా వచ్చేస్తోంది.

వచ్చే ఆదివారం (ఏప్రిల్ 20) సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. “ఈ అల్టిమేట్ ఎంటర్టైనర్ చూసి తెగ నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి. మజాకా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో” అనే క్యాప్షన్ తో ఆ ఛానెల్ ఈ విషయం తెలిపింది.

థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఈ సినిమాను ఓటీటీలో మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓటీటీలోకి అడుగుపెట్టిన తొలి వారంలోపే 10 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఈ మాజాకా వరల్డ్ టీవీ ప్రీమియర్ పై ఆసక్తి నెలకొంది.

మజాకా మూవీ గురించి..

మజాకా మూవీకి త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లాజిక్స్‌తో పాటు సంబంధం కామెడీతో మ్యాజిక్ చేస్తూ హిట్టు కొట్ట‌చ్చ‌ని ఇటీవ‌ల కాలంలో రిలీజైన ప‌లు సినిమాలు రుజువు చేశాయి. ఆ స‌క్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ వ‌చ్చిన మూవీ మ‌జాకా. ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు ప్ర‌తి సీన్ నుంచి కామెడీ జ‌న‌రేట్ అయ్యేలా సీన్లు రాసుకున్నారు.

సందీప కిష‌న్‌, రావుర‌మేష్ ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌టం, త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డానికి వారు ప‌డే పాట్లు, ప్రేమ‌లేఖ‌లు రాయ‌డం లాంటి సీన్స్‌తో ఫ‌స్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగిపోతుంది. క‌థ అంటూ పెద్ద‌గా లేక‌పోయినా కామెడీతో నెట్టుకొచ్చాడు డైరెక్ట‌ర్‌. మీరా, య‌శోద ఇద్ద‌రు ఒకే ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంటూ రివీల‌య్యే ఇంట‌ర్వెల్ ట్విస్ట్ బాగుంది. వారిమ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిటి? త‌మ ఫ్యామిలీతో ప‌గ‌పై ర‌గిలిపోతున్న భార్గ‌వ‌వ‌ర్మ‌కు ఆ కుటుంబానికి సంబంధం ఉందంటూ సెకండాఫ్‌పై ఆస‌క్తిని రేకెత్తించారు.

సందీప్‌కిష‌న్‌కు ఇలాంటి జోవియ‌ల్ క్యారెక్ట‌ర్లు అల‌వాటే. కృష్ణ పాత్ర‌లో కామెడీ టైమింగ్ బాగుంది. హీరోకు స‌మానంగా క‌నిపించే క్యారెక్ట‌ర్‌లో రావుర‌మేష్ మెప్పించాడు. మిడిల్ ఏజ్‌లో ప్రేమ‌లో ప‌డే వ్య‌క్తిగా న‌వ్వించాడు. కొన్ని ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మెప్పించాడు. సందీప్‌కిష‌న్‌, రావుర‌మేష్ ఇద్ద‌రు పోటీప‌డి న‌టించారు. రీతూవ‌ర్మ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ టైప్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం