OTT Malayalam: ఓటీటీలోకి నెలలోపే వచ్చేసిన మలయాళ కామెడీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!-mayalayam comedy drama movie dassettante cycle now streaming on manorama max ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam: ఓటీటీలోకి నెలలోపే వచ్చేసిన మలయాళ కామెడీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Malayalam: ఓటీటీలోకి నెలలోపే వచ్చేసిన మలయాళ కామెడీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Malayalam Comedy Movie: దాసెట్టంటే సైకిల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెలలోనే ఈ సినిమా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..

OTT Malayalam: ఓటీటీలోకి నెలలోపే వచ్చేసిన మలయాళ కామెడీ డ్రామా సినిమా

మలయాళ సీనియర్ యాక్టర్ హరీశ్ పేరడి ప్రధాన పాత్రలో దాసెట్టంటే సైకిల్ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ డ్రామా చిత్రానికి అఖిల్ కవుంగల్ దర్శకత్వం వహించారు. ఈ లోబడ్జెట్ చిత్రం మోస్తరుగా థియేట్రికల్ రన్ సాధించింది. ఇప్పుడు ఈ దాసెట్టంటే సైకిల్ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.

స్ట్రీమింగ్ వివరాలివే

దాసెట్టంటే సైకిల్ చిత్రం నేడు (ఏప్రిల్ 13) మనోరమ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మలయాళంలో మాత్రమే స్ట్రీమ్ అవుతోంది.

దాసెట్టంటే సైకిల్ మూవీని కామెడీతో పాటు సామాజిక అంశాలతో ముడిపెట్టి తెరకెక్కించారు డైరెక్టర్ అఖిల్. వాచ్‍మెన్‍గా పని చేసే ఓ మిడిల్‍క్లాస్ వ్యక్తి ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

దాసెట్టంటే సైకిల్ చిత్రంలో హరీశ్ పేరడితో పాటు అంజన అప్పుకుట్టన్, వైదిపేరడి, కబని, సుకుమారన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏసీ గిరీశన్ సంగీతం అందించగా.. జోమోన్ సిరియాక్ ఎడిటింగ్ చేశారు.

ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన హరీశ్ పేరడినే నిర్మాతగానూ ఉన్నారు. థియేటర్లలో ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. మోస్తరు ఫలితాన్ని దక్కించుకుంది. ఈ మూవీని ఇప్పుడు మనోరమ మ్యాక్స్ ఓటీటీలో చూడొచ్చు.

రీసెంట్‍గా సోనీలివ్‍లో ‘ప్రావింకూడు షప్పు’

మలయాళ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రావింకూడు షప్పు ఈవారమే సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, షౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 16వ తేదీన థియేటర్లలో విడుదలైన ప్రావింకూడు షప్పు సూపర్ హిట్ అయింది. సుమారు 80 రోజుల తర్వాత సోనీలివ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రానికి శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రూ.10కోట్లతో రూపొంది.. సుమారు రూ.18కోట్ల కలెక్షన్లతో మంచి సక్సెస్ సాధించింది. సోనీలివ్‍లోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం