Max OTT Streaming: ఆ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. నాలుగు రోజుల్లోనే మలయాళం రీమేక్ మూవీ రికార్డు బ్రేక్
Max OTT Streaming: ఓటీటీలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే అత్యధిక మంది చూసిన సినిమా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

Max OTT Streaming: కిచ్చా సుదీప్ మ్యాక్స్ మూవీ ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. గత శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి 7.30 గంటల నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే అత్యధిక వ్యూస్ సంపాదించిన మూవీగా నిలిచింది. ఇప్పటి వరకూ మలయాళం రీమేక్ మూవీ మిసెస్ పేరిట ఈ రికార్డు ఉండగా.. మ్యాక్స్ ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించింది.
మిసెస్ రికార్డు బ్రేక్ చేసిన మ్యాక్స్
కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ మూవీ కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు సాన్యా మల్హోత్రాకు చెందిన ఫ్యామిలీ డ్రామా మిసెస్ ను కూడా వెనక్కి నెట్టింది.
ఇది మలయాళం మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ రీమేక్. ఫిబ్రవరి 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మ్యాక్స్ రాకముందు వరకూ గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన, జీ5లో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది. అయితే మ్యాక్స్ ఇప్పుడా రికార్డును బ్రేక్ చేసింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైన మ్యాక్స్ మూవీ ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది.
కానీ ఓటీటీలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన రెస్పాన్స్ వస్తోంది. కిచ్చా సుదీప్ కు ఉన్న మాస్ ఇమేజ్ ఓటీటీలో మ్యాక్స్ మూవీ రికార్డులు క్రియేట్ చేయడానికి కారణమని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం జీ5లోని టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో సుదీప్ కే చెందిన 2022లో వచ్చిన మూవీ విక్రాంత్ రోనా కూడా ఉంది.
కిచ్చా సుదీప్ నెక్ట్స్ మూవీ
కిచ్చా సుదీప్ మ్యాక్స్ తో హిట్ అందుకున్నాడు. మంగళవారం (ఫిబ్రవరి 18) తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. విక్రాంత్ రోనా డైరెక్టర్ అయిన అనూప్ భండారీతోనే ఇప్పుడు బిల్లా రంగా బాషా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి రెండో వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది.
హనుమాన్ ను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సుదీప్.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో బిజీగా ఉన్నాడు.
సంబంధిత కథనం