అర్ధరాత్రి ఇంట్లో దొంగతనం.. డైరెక్ట్ ఓటీటీలోకి మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్.. భయపెట్టే సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-mask ott release date survival thriller to streaming on etv win katha sudha on october 12 ott thrillers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అర్ధరాత్రి ఇంట్లో దొంగతనం.. డైరెక్ట్ ఓటీటీలోకి మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్.. భయపెట్టే సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అర్ధరాత్రి ఇంట్లో దొంగతనం.. డైరెక్ట్ ఓటీటీలోకి మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్.. భయపెట్టే సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి మరో థ్రిల్లర్ రాబోతుంది. అర్ధరాత్రి ఇంట్లో దొంగతనం నేపథ్యంలో తెరకెక్కిన చిన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూసేయండి.

ఓటీటీలోకి సర్వైవల్ థ్రిల్లర్ (x/etvwin)

ఓటీటీలోకి మరో సర్వైవల్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. ఉత్కంఠతో ఊపేసే చిన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఓ వైపు భయం, మరోవైపు మిస్టరీ, ఇంకోవైపు తప్పించుకోవడం.. ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమానే ‘మాస్క్’. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మాస్క్ ఓటీటీ

తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ ‘మాస్క్’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి ఆదివారం కథా సుధలో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సండే (అక్టోబర్ 12) కథా సుధలో భాగంగా మాస్క్ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.

ఇంట్లో దొంగతనం

ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతున్న మాస్క్ మూవీ ఇంట్లో దొంగతనం చూట్టూ సాగబోతుంది. ఓ అర్ధరాత్రి ఇంట్లో దొంగతనం జరిగే సమయంలో నెలకొనే భయాలు, మిస్టరీ కలిసి సర్వైవల్ థ్రిల్లర్ గా మాస్క్ తెరకెక్కింది. ఈ సినిమా కథా సుధలో భాగంగా అక్టోబర్ 12న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రతి సండే

ఓ వైపు ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లతో దూసుకెళ్తున్న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్.. మరోవైపు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కథా సుధను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో భాగంగా ప్రతి సండే ఓ కొత్త షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తోంది. కె.రాఘవేంద్ర రావు, సతీష్ వేగేశ్న లాంటి డైరెక్టర్లు తీర్చిదిద్దిన షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇందులో రిలీజయ్యాయి. ఈ సండే మాస్క్ అనే చిన్న సినిమా రాబోతుంది.

షార్ట్ ఫిల్మ్స్

కథా సుధలో భాగంగా ప్రతి సండే ఓ కొత్త షార్ట్ ఫిల్మ్ ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది. దీని నిడివి 30 నుంచి 40 నిమిషాల మధ్య ఉంటుంది. ఫ్యామిలీ, ఎమోషనల్, క్రైమ్, లవ్, రొమాంటిక్, థ్రిల్లర్.. ఇలా డిఫరెంట్ జోనర్లలో చిన్న సినిమాలు ఈ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

ఉత్తరం, లైఫ్ పార్ట్ నర్, లవ్యూ నానమ్మ, వెండి పట్టీలు, ట్రింగ్.. ట్రింగ్, పెంకుటిల్లు, సుందరం గాడి ప్రేమ కథ, కాలింగ్ బెల్, నాతి చరామి, డియర్ డాడీ, ప్రేమంటే ఇది కదా, ఏవి అలనాటి ముద్దులు, దొరికిన ప్రేమలేఖ, దొరకు సెల్ ఫోన్ వచ్చింది, ప్రేమ ఎక్కడ నీ చిరునామా, నమ్మకం, అద్దంలో చందమామ తదితర చిన్న సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం