Martin Luther King OTT Release Date: సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Martin Luther King OTT Release Date: సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను సోనీలివ్ రివీల్ చేసింది.
Martin Luther King OTT Release Date: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన సినిమా మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. అక్టోబర్ 27న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పొలిటికల్ సెటైరికల్ మూవీగా వచ్చిన ఈ సినిమా సోనీలివ్ ఓటీటీలోకి రాబోతోంది. పూజా అపర్ణ కొల్లూరు ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయమైంది.
ట్రెండింగ్ వార్తలు
మార్టిన్ లూథర్ కింగ్ మూవీ నవంబర్ 29 నుంచి స్ట్రీమ్ అవనున్నట్లు సోనీలివ్ ఓటీటీ మంగళవారం (నవంబర్ 21) వెల్లడించింది. "ఒక్క ఓటు విలువ ఎంతో చాటి చెప్పే చమత్కారమైన పొలిటికల్ సెటైర్ మూవీ. మార్టిన్ లూథర్ కింగ్ మూవీని నవంబర్ 29 నుంచి సోనీలివ్ లో చూడండి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలోనూ స్ట్రీమ్ కానుంది" అని సోనీలివ్ ట్వీట్ చేసింది.
ఈ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుతోపాటు వెంకటేశ్ మహా, నరేష్, శరణ్య ప్రదీప్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్మరణ్ సాయి మ్యూజిక్ అందించాడు. వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్, వెంకటేశ్ మహాకు చెందిన మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.
మార్టిన్ లూథర్ కింగ్ కథేమిటంటే?
పడమరపాడు అనే ఊరికి చెందిన స్మైల్ (సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ బతుకుతుంటాడు. ఊరిలో జరిగిన ఎన్నికల్లో స్మైల్ ఓటు కీలకంగా మారుతుంది. అతడు ఓటు వేసిన వారే గెలిచే అవకాశం ఉండటంతో స్మైల్ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది. అతడికి మార్టిన్ లూథర్ కింగ్ అని ఎవరు పేరు పెట్టారు. లోకి (వెంకటేష్ మహా), జగ్గు(నరేష్)లలో తన ఓటును స్మైల్ ఎవరికి వేశాడు అన్నదే ఈ సినిమా కథ.