OTT Action Comedy: ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ కామెడీ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
Polite Society OTT Streaming: పొలైట్ సొసైటీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ వుమెన్ ఓరియెంటెడ్ యాక్షన్ కామెడీ చిత్రం నేడే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఉమెన్ సెంట్రిక్ చిత్రం ‘పొటైట్ సొసైటీ’ గతేడాది విడుదలైంది. ఈ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ కామెడీ సినిమా ప్రశంసలు దక్కించుకుంది. ఈ ఇంగ్లిష్ మూవీలో ప్రియా ఖన్సారా, రితూ ఆర్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిదా మంజూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే కొన్ని ప్లాట్‍ఫామ్‍ల్లో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. అయితే, నేడు (ఆగస్టు 28) రెంట్ లేకుండా ఓ ఓటీటీలో పొలైట్ సొసైటీ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పొలైట్ సొసైటీ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (ఆగస్టు 28) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు హిందీలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
పొలైట్ సొసైటీ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే, నేడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నెట్‍ఫ్లిక్స్ సబ్‍స్క్రైబర్లందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు.
పొలైట్ సొసైటీ చిత్రాన్ని డైరెక్టర్ నిదా మంజూర్ తెరకెక్కించారు. మార్షల్ ఆర్ట్స్, అక్కాచెల్లెళ్ల సెంటిమెంట్, కామెడీ అంశాలు ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ గతేడాది ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
టాప్ స్టంట్ పర్ఫార్మర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న రియా ఖాన్ (ప్రియా ఖన్సారా).. సోదరికి ఇష్టం లేని పెళ్లిని ఆపడం చుట్టూ పొలైట్ సొసైటీ స్టోరీ సాగుతుంది. వారికి ఎదురైన సవాళ్లు, సామాజిక పరిస్థితులు ఇలా చాలా అంశాలు ఈ మూవీలో ఉంటాయి. అన్నింటిని దాటుకొని రియా పాపులర్ స్టంట్స్ పర్ఫార్మర్ అవుతుందా అనేది ప్రధాన విషయంగా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రియ, రితూ ఆర్యతో పాటు నిమ్రా బుచా, అక్షయ్ ఖన్నా, సెరఫినా బేహ్, ఇలా బ్రూసెలేరీ, శోభూ కపూర్ కీలకపాత్రలు పోషించారు.
పొలైట్ సొసైటీ మూవీని వర్కింగ్ టైటిల్ ఫిల్మ్స్, పార్క్‌విల్లే పిక్చర్స్ పతాకంపై టిమ్ బేవన్, ఎరిక ఫెల్నెర్, ఒలివర్ కంఫెర్, జాన్ పోకోక్ నిర్మించారు. ఈ చిత్రానికి టామ్ హోవీ, షెజ్ మంజూర్ సంగీతం అందించారు.
నెట్‍ఫ్లిక్స్‌లో ‘బడ్డీ’
అల్లు శిరీష్ హీరోగా నటించిన తెలుగు సినిమ ‘బడ్డీ’ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. ఆగస్టు 30వ తేదీన ఈ సినిమా అడుగుపెట్టనుంది. నెట్‍ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం బడ్డీ ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో విడులైంది. ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అనుకున్న విధంగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది.
బడ్డీ మూవీకి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. అల్లు శిరీష్ సరసన గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్‍గా నటించారు. ప్రిషా రాజేశ్ సింగ్, అజ్మల్ అమీర్, అలీ, ముకేశ్ రిషి, శ్రీరామ్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. బడ్డీగా టెడ్డీ గోకులన్ నటించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, ఆరాధన నిర్మించిన ఈ మూవీకి హిప్‍హాప్ తమిళ సంగీతం అందించారు. బడ్డీ చిత్రాన్ని ఆగస్టు 30 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.