Mark Antony Twitter Review: విశాల్‍కు హిట్ పడినట్టేనా.. 'మార్క్ ఆంటోనీ' మూవీకి టాక్ ఎలా ఉందంటే!
Mark Antony Twitter Review: విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ట్విట్టర్లో ఈ మూవీ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే.
Mark Antony Twitter Review: తమిళ హీరో విశాల్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం నేడు (సెప్టెంబర్ 15) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. రెట్రో యాక్షన్, కామెడీ, ట్రైమ్ ట్రావెల్ ఇలా ట్రైలర్ ఆకట్టుకోవటంతో మార్క్ ఆంటోనీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మంచి హైప్ వచ్చింది. ఈ తరుణంలో నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చింది. మరి, మార్క్ ఆంటోనీ చిత్రం చూసిన నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..
మార్క్ ఆంటోనీ చిత్రంలో విశాల్, ఎస్‍జే సూర్య యాక్టింగ్ గురించి ఎక్కువ మంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఎస్‍జే సూర్య నటన క్రేజీగా ఉందని అంటున్నారు. గ్యాంగ్‍స్టర్లుగా విశాల్, ఎస్‍జే సూర్య చేసిన రెట్రో యాక్షన్, కామెడీ సూపర్‌గా ఉందని చాలా మంది నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ కాస్త యావరేజ్‍గా ఉన్నా.. సెకండ్ హాఫ్ ఫుల్ ఫన్, యాక్షన్‍తో అదిరిపోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మార్క్ ఆంటోనీని థియేటర్లలో చూడాలంటూ చాలా మంది రెకమెండ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ టేకింగ్.. మార్క్ ఆంటోనీ చిత్రానికి హైలైట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. రెట్రో స్టైల్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్‍గా విభిన్నంగా ఎంటర్‌టైనింగ్‍గా మార్క్ ఆంటోనీ చిత్రాన్ని ఆయన తెరెక్కించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత క్యారెక్టర్‌ను రీక్రియేట్ చేయడం బాగా ప్లస్ అయిందని నెటిజన్లు అంటున్నారు. ఈ చిత్రంలో సిల్క్ స్మిత క్యారెక్టర్ చేశారు మోడల్ విష్ణుప్రియ. ఆమె మేకోవర్‌ను సిల్క్ స్మితలాగే డిజైన్ చేశారు. ఈ సినిమాకు సిల్క్ సీన్లు కూడా బలమని అంటున్నారు. 1980ల బ్యాక్‍డ్రాప్‍లోనూ ఈ చిత్రం ఉండటంతో సిల్క్ స్మిత క్యారెక్టర్‌ను పెట్టారు.
కొన్ని లాజిక్‍లను పక్కన పెట్టి చూస్తే మార్క్ ఆంటోనీ సినిమా మెప్పిస్తుందని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జీవీ ప్రకాశ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి ప్లస్‍గా మారిందని అంటున్నారు. సునీల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందని కామెంట్లు వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.
మొత్తంగా, మార్క్ ఆంటోనీ సినిమాకు ఇప్పటి వరకు నెటిజన్ల నుంచి పాజిటివ్ రివ్యూలే అధికంగా వస్తున్నాయి. ఇదే ట్రెండ్.. పాజిటివ్ మౌత్ టాక్ కొనసాగితే చాలా కాలం తర్వాత విశాల్‍కు హిట్ పడినట్టే. చంద్రముఖి-2 కూడా వాయిదా పడటంతో మార్క్ ఆంటోనీకి తమిళంలో తిరుగుండదు. ఈ చిత్రంలో తెలుగులోనూ డబ్బింగ్‍లో రిలీజ్ అయింది. ఈ వారం తెలుగులోనూ పెద్ద సినిమాలు రిలీజ్ కావటం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ మార్క్ ఆంటోనీకి మంచి ఛాన్స్ ఉంది.