Mark Antony OTT: అఫీషియల్: విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ వివరాలివే
Mark Antony OTT Release: విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా ఓటీటీలోకి వచ్చే తేదీ ఖరారైంది. ఈ విషయంపై అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన చేసింది.
Mark Antony OTT Release: తమిళ హీరో విశాల్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ‘మార్క్ ఆంటోనీ’ సినిమా అంచనాలకు తగ్గట్టే విజయం సాధించింది. టైమ్ ట్రావెల్, కామెడీ కలబోతతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమా వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధించింది. సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన మార్క్ అంటోనీ రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. విశాల్ కెరీర్‌లో తొలి రూ.100కోట్ల మూవీగా నిలిచింది. ఇప్పుడు మార్క్ ఆంటోనీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది.

మార్క్ ఆంటోనీ సినిమా అక్టోబర్ 13వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ నేడు (అక్టోబర్ 10) అధికారికంగా ప్రకటించింది. తమిళం, తెలుగులో అక్టోబర్ 13 తేదీన మార్క్ ఆంటోనీ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అక్టోబర్ 13న మార్క్ ఆంటోనీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తుందని కొంతకాలంగా సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, నేడు ఈ విషయంపై అధికారికంగా ప్రకటించి క్లారిటీ ఇచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో.
మార్క్ ఆంటోనీ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. గ్యాంగ్‍స్టర్ల బ్యాక్‍డ్రాప్‍లో టైమ్ ట్రావెల్, కామెడీ, యాక్షన్‍ను కలిపి ఈ చిత్రాన్ని అతడు తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు దక్కాయి. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. పీటెర్ హెయిన్ సహా నలుగురు యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఈ సినిమా కోసం పని చేశారు. మార్క్ ఆంటోనీలో డ్యుయల్ రోల్ చేశారు విశాల్.
ఆంటోనీ (విశాల్), జాకీ పాండియన్ (ఎస్‍జే సూర్య) మంచి స్నేహితులుగా ఉంటారు. వీరికి ఏకాంబరం (సునీల్) అనే శత్రువు ఉంటారు. 1975ల్లో గొడవల్లో మార్క్ చనిపోతారు. 1995లో అతడి కొడుకు మార్క్ (విశాల్)కు ఓ టైమ్ ట్రావెల్ టెలిఫోన్ దొరుకుతుంది. దీంతో గతంలోకి వెళ్లి తన తండ్రి ఆంటోనీతో మాట్లాడాలని ఆంటోనీ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. తన తండ్రి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. అసలు తన తండ్రికి ద్రోహం చేసింది ఎవరో గుర్తిస్తాడు. మరి తన తండ్రిని మార్క్ ఎలా కాపాడుకోగలిగాడు.. ఆంటోనీ మంచి వ్యక్తేనా.. అసలు ద్రోహి ఎవరు అనేదే ఈ సినిమా ప్రధాన కథగా ఉంది.
మార్క్ ఆంటోనీ సినిమాలో రితూ వర్మ హీరోయిన్‍గా నటించగా.. సునీల్ ముఖ్యమైన పాత్ర పోషించారు. అభినయ, సెల్వరాఘవన్, రవి, రెడిన్ కింగ్‍స్లే కీరోల్స్ చేశారు.
టాపిక్