Malayalam OTT: తెలుగులో మరో ఓటీటీలోకి రానున్న మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ - 30 కోట్లతో తీస్తే 115 కోట్లు వచ్చాయి!
Malayalam OTT: మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ మార్కో తెలుగులో మరో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇటీవలే సోనీలివ్ లో విడుదలైన ఈ మూవీ తాజాగా ఆహా ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 21న నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ యాక్షన్ మూవీలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు.

Malayalam OTT: మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ మార్కో తెలుగులో మరో ఓటీటీలోకి రానుంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 21 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
సోనీలివ్ ఓటీటీలో...
ఇటీవలే మార్కో మూవీ సోనీలివ్ ఓటీటీలో రిలీజైంది. తెలుగు, మలయాళంతో పాటు మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ఓటీటీలో మాత్రం కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే చూడొచ్చు.
30 కోట్ల బడ్జెట్…
మార్కో మూవీకి హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 115 కోట్ల వసూళ్లను రాబట్టింది. గత ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా ఏ రేటింగ్‌తో రిలీజై అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళం మూవీగా నిలిచింది.
మోస్ట్ వయలెన్స్ మూవీ...
మార్కో మూవీలో సిద్ధిఖీ, కబీర్ దుహాన్ సింగ్, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు. వయోలెన్స్, రక్తపాతానికి ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. కథ రొటీన్ అయినా యాక్షన్ ఎపిసోడ్స్‌తో అభిమానులను మెప్పించాడు దర్శకుడు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై వచ్చిన మోస్ట్ వయలెంట్ మూవీగా మార్కోను ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్ పేర్కొన్నారు. గుండె సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలు ఈ మూవీ చూడొద్దంటూ వెరైటీ ప్రమోషన్స్‌తో మేకర్స్ ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించారు. యాక్షన్ సినిమా లవర్స్‌ను సైతం దర్శకుడు భయపెట్టించాడు.
మార్కో మూవీ కథ ఇదే...
రివేంజ్ డ్రామాగా మార్కో మూవీ రూపొందింది. కొచ్చిన్‌లోని గోల్డ్ సిండికేట్‌కు జార్జ్ (సిద్ధిఖీ) లీడర్‌గా వ్యవహరిస్తోంటాడు. జార్జ్ తమ్ముడు విక్టర్ (ఇషాన్)పుట్టుకతోనే అంధుడు. విక్టర్ దారుణ హత్యకు గురవుతాడు. విక్టర్ మరణానికి కారణమైన వారిని పట్టుకుంటానని మార్కో ఛాలెంజ్ చేస్తాడు?
అసలు మార్కో ఎవరు? విక్టర్ కుటుంబంతో అతడికి ఉన్న సంబంధమేమిటి? విక్టర్ హత్యకు గోల్డ్ సిండికేట్ మెంబర్స్ టోనీ ఇసాక్ (జగదీష్) అతడి కొడుకు రసెల్ ఇసాక్ (అభిమన్యు తిలకన్) ఎలాంటి సంబంధం ఉంది? మార్కో రివేంజ్ కారణంగా జార్జ్ ఫ్యామిలీ ఎలాంటి కష్టాలు పడింది అన్నదే ఈ మూవీ కథ.
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌తో...
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు ఉన్ని ముకుందన్. ఆ తర్వాత అనుష్క భాగమతి, సమంత యశోదతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. హీరోగానే కాకుండా మలయాళంలో ప్రొడ్యూసర్‌గా, సింగర్‌గా టాలెంట్‌ను నిరూపించుకున్నాడు ఉన్ని ముకుందన్.
సంబంధిత కథనం