OTT Action: ఓటీటీలోకి ఈ వారమే బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ.. 4 భాషల్లో స్ట్రీమింగ్-marco ott streaming this week unni mukundran action thriller movie to release on sony liv in 4 languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action: ఓటీటీలోకి ఈ వారమే బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ.. 4 భాషల్లో స్ట్రీమింగ్

OTT Action: ఓటీటీలోకి ఈ వారమే బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ.. 4 భాషల్లో స్ట్రీమింగ్

OTT Action Thriller: ఎంతో మంది ఎదురుచూస్తున్న మార్కో ఓటీటీ స్ట్రీమింగ్ సమీపిస్తోంది. ఈవారంలోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ వైలెంట్ యాక్షన్ మూవీ నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవనుంది.

OTT Action Thriller: ఓటీటీలోకి ఈ వారమే సూపర్ హిట్ వైలెంట్ మూవీ.. 4 భాషల్లో స్ట్రీమింగ్

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. మోస్ట్ వైలెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది. యానిమల్, కిల్ చిత్రాలకు మించి వైలెంట్‍గా ఉందంటూ టాక్ దక్కించుకుంది. మార్కో చిత్రం గతేడాది డిసెంబర్ 20న మలయాళంలో థియేటర్లలో రిలీజై కలెక్షన్లు దూకుడుగా రాబట్టింది. హిందీలోనూ రిలీజైంది. ఆ తర్వాత తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చి మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు మార్కో చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ వారమే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

చాలా పాపులర్ అయిన మార్కో మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ థియేటర్ వెర్షన్‍లో లేని కొన్ని సీన్లు ఓటీటీలో ఉంటాయనే అంచనాలు ఉండటంతో మరింత ఆసక్తి నెలకొంది.

స్ట్రీమింగ్ వివరాలు

మార్కో చిత్రం ఫిబ్రవరి 14వ తేదీని సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ డేట్‍ను ఆ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. హిందీ వెర్షన్‍పై అప్‍డేట్ ఇవ్వలేదు. మొత్తంగా ఈ వారంలోనే ఫిబ్రవరి 14 నుంచి ఈ చిత్రాన్ని సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.

మార్కో బడ్జెట్, కలెక్షన్లు ఇలా..

మార్కో మూవీ దాదాపు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. మొత్తంగా సుమారు సుమారు రూ.117 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని తెలుస్తోంది. కేరళలో ఈ మూవీ జోరుగా వసూళ్లను రాబట్టింది. హిందీ, తెలుగులోనూ పర్వాలేదనిపించింది. కన్నడలోనూ థియేటర్లలోకి వచ్చింది. మొత్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. మలయళ మోస్ట్ వైలెంట్ మూవీగానూ పాపులర్ అయింది.

మార్కో మూవీని డైరెక్టర్ హనీఫ్ అదేనీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‍తో పాటు కబీర్ దుహాన్ సింగ్, సిద్దిఖీ, అభిమన్యు తిలకన్, జగదీశ్, యుక్తి తరేజా, శ్రీజిత్ రవి కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.

మార్కో సినిమా రివేంజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రంలో క్రూరమైన హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వైలెంట్ యాక్షన్ ఇష్టమైన వారిని ఈ చిత్రం మెప్పించింది. హనీఫ్ టేకింగ్‍కు ప్రశంసలు వచ్చాయి. అయితే, హింస మరీ విపరీతంగా ఉందనే కామెంట్లు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ చిత్రం బాగా పాపులర్ అయింది. ఉన్ని ముకుందన్‍ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‍గా నిలిచింది.

సంబంధిత కథనం