OTT Malayalam Action Thriller: ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన రూ.115 కోట్ల మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
OTT Malayalam Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి ఈ సినిమా వస్తుందని ముందుగా అనౌన్స్ చేసినా.. ఇప్పుడు గురువారం (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం నుంచే సడెన్‌గా స్ట్రీమింగ్ మొదలైంది.

OTT Malayalam Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ, గతేడాది బాక్సాఫీస్ దగ్గర రూ.115 కోట్లు వసూలు చేసిన మార్కో ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.
మార్కో ఓటీటీ స్ట్రీమింగ్
మార్కో మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని సోనీ లివ్ (Sony Liv) ఓటీటీ చాలా రోజుల కిందటే అనౌన్స్ చేసింది. ఆ లెక్కన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూవీ వస్తుందని అందరూ భావించారు. కానీ సడెన్ గా మధ్యాహ్నం నుంచే మార్కో స్ట్రీమింగ్ మొదలైంది.
ఈ విషయాన్ని సోనీ లివ్ ఓటీటీ కూడా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “యుద్ధం మొదలైంది. మార్కో వచ్చేశాడు” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. ఊహించిన దాని కంటే ఒక రోజు ముందే మార్కో ఓటీటీలోకి రావడం అభిమానులకు ప్లజెంట్ సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు.
మార్కో మూవీ గురించి..
మార్కో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.115 కోట్లు వసూలు చేసింది. హనీఫ్ అదేనీ డైరెక్ట్ చేసిన ఈ మార్కో మూవీలో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో నటించాడు.
అతనితోపాటు సిద్ధిఖీ, జగదీశ్, అభిమన్యులాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. హింస మరీ ఎక్కువగా ఉందంటూ ఈ మూవీ రిలీజైన సమయంలో కామెంట్స్ వచ్చాయి. ఓ రివేంజ్ డ్రామాకు మితిమీరిన హింసను జోడించి ఈ మార్కో మూవీని తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో విలన్ గుండెను చీల్చి హీరో చంపేసే సీన్.. గన్‌తో విలన్ గ్యాంగ్ మెంబర్స్‌ను పీస్‌లు చేయడం, చైన్‌సా మిషన్‌తో కోసుకుంటే వెళ్లిపోవడం...ఇలాంటి సన్నివేశాలు సినిమా నిండా కనిపిస్తాయి.
యాక్షన్ లవర్స్ ను ఈ మార్కో మూవీ బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. మలయాళంతోపాటు తెలుగులోనూ సోనీ లివ్ ఓటీటీలో మార్కో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం