Marco OTT Release Date: వాలెంటైన్స్ డేనాడు వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..-marco ott release date malayalam most violent action thriller movie to stream on sony liv from 14th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Marco Ott Release Date: వాలెంటైన్స్ డేనాడు వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Marco OTT Release Date: వాలెంటైన్స్ డేనాడు వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Hari Prasad S HT Telugu
Jan 31, 2025 04:57 PM IST

Marco OTT Release Date: మలయాళం సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వాలెంటైన్స్ డేనాడు ఓటీటీలోకి వస్తోంది. మోస్ట్ వయోలెంట్ మూవీగా పేరుగాంచిన మార్కో అనుకున్నదాని కంటే చాలా ముందుగానే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

వాలెంటైన్స్ డేనాడు వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
వాలెంటైన్స్ డేనాడు వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Marco OTT Release Date: వాలెంటైన్స్ డేనాడు మోస్ట్ వయోలెంట్ మూవీని చూడటానికి సిద్ధంగా ఉండండి. ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ ఓటీటీ శుక్రవారం (జనవరి 31) తన ఎక్స్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది.

మార్కో ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన ఎ-రేటెడ్ మూవీగా నిలిచిన మార్కో (Marco) ఓటీటీలోకి వచ్చేస్తోంది. గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా 50 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా సోనీలివ్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్లు ఓటీటీలోకి రానుండగా.. హిందీ వెర్షన్ పై మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. నిజానికి హిందీ వెర్షన్ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది. మరి హిందీ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడన్నది వేచి చూడాల్సి ఉంది.

అయితే సోనీ లివ్ దగ్గర హిందీ వెర్షన్ హక్కులు మాత్రం లేనట్లుగా వార్తలు వస్తున్నాయి. "మలయాళం సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మీకోసం వస్తోంది. మార్కోతో అల్టిమేట్ అడ్రినలిన్ రష్ కోసం సిద్ధంగా ఉండండి. ఫిబ్రవరి 14 నుంచి మీ సోనీలివ్ లో" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది.

మార్కో మూవీ గురించి..

హనీఫ్ అదేనీ డైరెక్ట్ చేసిన మార్కో మూవీలో ఉన్ని ముకుందన్ తోపాటు జగదీశ్, అన్సన్ పాల్, కబీర్ దుహాన్ సింగ్, అభిమన్యు ఎస్, తిలకన్, యుక్తి తరేజా నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు. మార్కో సాదాసీదా రివేంజ్ డ్రామా మూవీ. త‌న సోద‌రుడి మ‌ర‌ణంపై ప్ర‌తీకారం తీర్చుకునే ఓ యువ‌కుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు హ‌నీఫ్ అదేని మార్కో మూవీని తెర‌కెక్కించాడు.

చెప్పుకుంటే రెండు నిమిషాల్లోనే ముగిసిపోయే క‌థ‌తో రెండు గంట‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పై భీభ‌త్స‌మే సృష్టించాడు. సినిమాలోని ఒక్కో యాక్ష‌న్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌లా ఉంటుంది. ర‌క్తం ఏరులై పారుతుంది. యాక్ష‌న్ ల‌వ‌ర్స్ సైతం ఈ రేంజ్ ర‌క్త‌పాతాన్ని భ‌రించ‌లేమ‌ని అనుకునేలా చేశాడు డైరెక్ట‌ర్‌.

ఉన్ని ముకుంద‌న్ వ‌న్ మెన్ షోగా మార్కో మూవీ నిలుస్తుంది. ప్ర‌తీకారంతో ర‌గిలిపోయే యువ‌కుడిగా స్టైలిష్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. యాక్ష‌న్ సీన్స్‌లో అద‌ర‌గొట్టాడు. జార్జ్ పాత్ర‌లో సిద్ధిఖీ, విక్ట‌ర్‌గా ఇషాన్ మెప్పించారు. జ‌గ‌దీష్‌, క‌బీర్ సింగ్ దుహాన్‌, అభిమ‌న్యు తిల‌క‌న్ హీరోగా ధీటుగా త‌మ విల‌నిజంతో ఆక‌ట్టుకున్నారు. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌కు ర‌వి బ‌స్రూర్ అందించిన బీజీఎమ్ తోడ‌వ్వ‌డంతో థియేట‌ర్ల‌లో గూస్‌బంప్స్ ఫీలింగ్ క‌లుగుతుంది.

Whats_app_banner