Marco OTT: బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ ఓటీటీ రిలీజ్.. ఆ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్-marco ott hindi versions release in dilemma fans demanding for clarity ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Marco Ott: బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ ఓటీటీ రిలీజ్.. ఆ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్

Marco OTT: బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ ఓటీటీ రిలీజ్.. ఆ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్

Marco OTT: మలయాళ సినిమా మార్కో ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయింది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా వెల్లడైంది. అయితే, హిందీ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. దీంతో మేకర్లను సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

OTT Action Thriller: మోస్ట్ వైలెంట్ బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

మలయాళ మూవీ ‘మార్కో’ చాలా బజ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 20న మలయాళం, హిందీలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. మలయాళంలో భారీ కలెక్షన్లు దక్కించుకుంది. హిందీలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది. జనవరి 1న తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో.. మలయాళ మోస్ట్ వైలెంట్ మూవీగా పాపులర్ అయింది. బ్లాక్‍బస్టర్ సాధించింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయినా.. హిందీ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే.. హిందీపై నో అప్‍డేట్

మార్కో సినిమాను జనవరి 14వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సోనీ లివ్ ఓటీటీ వెల్లడించింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడల్లో స్ట్రీమింగ్‍కు తెస్తామని వెల్లడించింది. హిందీ వెర్షన్‍ను ప్రస్తావించలేదు. దీంతో మార్కో చిత్రం స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న హిందీ ప్రేక్షకులకు అసంతృప్తి ఎదురైంది.

హిందీ ఎప్పుడో చెప్పండి

మార్కో హిందీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి క్లారిటీ ఇవ్వాలని ఉన్ని ముకుందన్‍ను, సోనీ లివ్‍ను ట్యాగ్ చేసి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి కూడా అప్‍డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హిందీ వెర్షన్‍కు ఏమైందని మూవీ మేకర్లను ప్రశ్నిస్తున్నారు. మరి హిందీ స్ట్రీమింగ్ హక్కులు సోనీ లివ్ దగ్గరే ఉన్నాయా.. వేరే ప్లాట్‍ఫామ్ తీసుకుందా అనేది చూడాలి. హిందీ వెర్షన్‍పై క్లారిటీ కోసం కొందరు ప్రేక్షకులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మార్కో సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.115కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకున్నట్టు అంచనా. ఈ చిత్రం సుమారు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. మొదటి నుంచే పాజిటివ్ టాక్‍తో భారీ కలెక్షన్లను దక్కించుకుంది. కేరళలో భారీ వసూళ్లతో దుమ్మురేపింది. నేషనల్ వైడ్‍లోనూ పాపులర్ అయింది. హిందీలోనూ మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులోనూ కలెక్షన్లను బాగానే సాధించింది. కన్నడలోనూ జనవరి 31న థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది.

మార్కో చిత్రానికి హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు. వైలెంట్ యాక్షన్‍తో రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. హింస, క్రూరమైన సన్నివేశాలు ఈ మూవీలో ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‍‍తో పాటు కబీర్ దుహాన్ సింగ్, సిద్దిఖీ, జగదీశ్, యుక్తి తరేజా, అభిమన్యు తిలకన్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ ప్రొడ్యూజ్ చేశారు.

సంబంధిత కథనం