ఈ మే మూడో వారంలో వివిధ ఓటీటీల్లోకి మూడు మలయాళ చిత్రాలు ఎంట్రీ ఇచ్చాయి. బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మరణమాస్ మంచి క్రేజ్‍తో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు మరో రెండు మలయాళ సినిమాలు కూడా ఇదే వారం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. వివరాలివే..
బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషించిన మరణమాస్ సినిమా ఈవారంలోనే సోనీ లివ్ ఓటీటీలో ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ స్ట్రీమ్ అవుతోంది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మలయాళ డార్క్ కామెడీ సినిమా.. ఈ వారం మే 14న సోనీ లివ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
మరణమాస్ సినిమా ఓ సీరియల్ కిల్లర్, యూట్యూబర్ చుట్టూ సాగుతుంది. ఈ చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. క్రైమ్ టచ్‍తో డార్క్ కామెడీతో ఈ చిత్రం తెరకెక్కి.. ప్రేక్షకులను మెప్పించింది. మలయాళంలో ఈ మూవీ బ్లాక్‍బస్టర్ సాధించింది. మరణమాస్‍లో బాసిల్ జోసెఫ్ మరోసారి యాక్టింగ్‍తో మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో సిజు సన్నీ, రాజేశ్ మాధవన్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను మలయాళ హీరో టొవినో థామస్‍తో పాటు టింగ్‍స్టన్, రఫేల్, తంజీర్ సలామ్ ప్రొడ్యూజ్ చేశారు.
మలయాళ కామెడీ డ్రామా సినిమా అయ్యర్ ఇన్ అరేబియా సినిమా ఈవారం మే 16వ తేదీన సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ముకేశ్, ఊర్వశి, ధన్య శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఏ నిషాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది ఫిబ్రవరి 2న రిలీజైంది. సుమారు 15 నెలల తర్వాత సన్‍నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది అయ్యర్ ఇన్ అరేబియా మూవీ. దుబాయ్‍కు వెళ్లే ఓ బ్రహ్మాణ కుటుంబం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ సినిమాకు ఆనంద్ మధుసూదన్ సంగీతం ఇవ్వగా.. విఘ్నేశ్ విజయ్ కుమార్ నిర్మించారు.
మలయాళ డ్రామా మూవీ ‘పరాన్ను పరాన్ను పరాన్ను చల్లన్’ సినిమా మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఈ వారమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ డిఫరెంట్ టైటిల్ చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో ఉన్ని లాలు, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జుస్సు హరీంద్ర వర్మ డైరెక్షన్ చేశారు.
సంబంధిత కథనం