ఓటీటీల్లో ఎన్నో రకాల చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు సైతం ఓటీటీలో అలరిస్తుంటాయి. ఇలాంటి ఎక్స్‌పరిమెంటల్ మూవీస్ ఎక్కువగా మలయాళం, హాలీవుడ్‌లో మాత్రమే వస్తాయని అపోహ ఉంది. కానీ, తెలుగులో కూడా ప్రయోగాత్మక చిత్రాలు ఎప్పుడో వచ్చాయి.
అందుకు ఉదాహరణే మను మూవీ. 2018లో వచ్చిన మను మూవీ తెలుగు లాంగ్వేజ్ ఎక్స్‌పరిమెంటల్ రొమాంటిక్ ఆర్ట్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. ఈ సినిమాతో ఫణీంద్ర నర్సెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. అంతేకాకుండా మను మూవీలో బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.
వీరితోపాటు అభిరామ్ వర్మ, కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ మోహన్ భగత్, జాన్ కొట్టోలి, అప్పాజీ అంబరీష దర్బ, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్, మిస్టరీ, సస్పెన్స్, మెలో డ్రామా థ్రిల్లర్ వంటి అంశాలతో మను తెరకెక్కించారు. సెప్టెంబర్ 7, 2018లో థియేటర్లలో విడుదలైన మను సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.6 రేటింగ్ వచ్చింది.
అంటే, అంతలా మను ఆకట్టుకుంది. దీనికంటే మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మను మూవీకి 115 మంది నిర్మాతలు ఉండటం. సాధారణంగా ఒకరిద్దరు, లేదా పది వరకు నిర్మాతలు ఉంటారు. కానీ, ఏకంగా 115 మంది నిర్మాతలతో తెరకెక్కిన సినిమాగా మను నిలిచింది. అయితే, మను సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించారు.
అంటే, మంచి సినిమా తీయాలని తపన ఉండే ఔత్సాహికులు కొన్ని చిత్రాలకు ఫండ్స్ ఇస్తారు. అలా క్రౌడ్ ఫండింగ్‌తో మను మూవీకి 115 మంది నిర్మాతలు అయ్యారు. దీంతో క్రౌడ్ ఫండింగ్‌తో తీసిన తొలి సినిమాగా కూడా మను రికార్డ్ కొట్టింది. ఇక సినిమాలో వచ్చే కెమెరా షాట్స్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి.
ఇంతటి విశేషాలు ఉన్న మను ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో మను డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లలో మను ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇండియా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మను అందుబాటులో లేదు. విదేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల మను సినిమాను చూడొచ్చు.
ఇకపోతే మను సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ యూనిక్ స్టోరీ టెల్లింగ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రతి ఒక్క సీన్ పెయింటింగ్‌లా ఉంటుందని, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందని సినిమా క్రిటిక్స్ చెప్పారు.
డైరెక్షన్, ప్రొడక్షన్, మ్యూజిక్, కలర్ కరెక్షన్, కాస్ట్యూమ్స్‌తో మను ఆకట్టుకుందని టాక్. అయితే, మను మూడు గంటల రన్‌టైమ్ కాస్తా ఓపికకు పరీక్ష పెడుతుందని మను సినిమాపై రివ్యూలు వచ్చాయి. ఈ తెలుగు రొమాంటిక్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మనును అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.
సంబంధిత కథనం