OTT Web Series: పాపులర్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన యాక్టర్
The Family Man 3 OTT Web Series: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‍లో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సీజన్ గురించి ఓ అప్‍డేట్ వచ్చింది. మనోజ్ బాజ్‍పేయ్ తాజాగా ఓ అప్‍డేట్ ఇచ్చారు.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍లోని తొలి రెండు సీజన్లు చాలా పాపులర్ అయ్యాయి. మనోజ్ బాజ్‍పేయి ప్రధాన పాత్రలో రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంది. ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‍ప్లే, ట్విస్టులతో ప్రేక్షకులను ఈ సిరీస్ ఆకట్టుకుంది. దీంతో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‍లో మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మనోజ్ నేడు (డిసెంబర్ 29) ఓ అప్‍డేట్ ఇచ్చారు.
షూటింగ్ కంప్లీట్
ది ఫ్యామిలీ మ్యాన్ 3 కోసం షూటింగ్ కోసం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు మనోజ్ బాజ్‍పేయ్ నేడు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపారు. ఓ కేక్ కట్ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు. “ఫ్యామిలీ మ్యాన్ 3 కోసం షూటింగ్ ముగిసింది. మరికొంత వేచిచూడండి” అని మనోజ్ రాసుకొచ్చారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 3 చిత్రీకరణ పూర్తయిందంటూనే.. కాస్త వేచి ఉండాలని అభిమానులకు మనోజ్ సూచించారు. ఈ సిరీస్ 2025 తొలి అర్ధ భాగంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడో సీజన్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‍లో టీఏఎస్‍సీ అనే ఇన్వెస్టిగేటివ్ విభాగం స్పై ఏజెంట్‍గా పని చేసే శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ నటిస్తున్నారు. అతడి భార్య సుచిత్ర తివారీ రోల్‍ను ప్రియమణి పోషిస్తున్నారు. ఈ సిరీస్‍లో షారిబ్ హష్మి, అశ్లేష ఠాకూర్, వేదాంత సిన్హా, షాహబ్ అలీ, సమంత రూత్ ప్రభు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు. మూడో సీజన్‍లో మరిన్ని కొత్త పాత్రలు ఉండే అవకాశం ఉంది.
మూడో సీజన్‍పై ఫుల్ హైప్
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‍ను రాజ్ & డీకే తెరకెక్కిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఏజెంజ్ శ్రీకాంత్ తివారీ.. స్పై మిషన్లను చేయడం చుట్టూ ఈ సిరీస్‍ను రూపొందించారు. 2019లో వచ్చిన ఈ సిరీస్ తొలి సీజన్ ఉగ్రవాదులను అడ్డుకోవడం చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్‍తో ఉంటుంది. మూడో సీజన్ కరోనా వైరస్, చైనా దాడులతో లింక్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. తొలి రెండు సీజన్లు ఆకట్టుకోవడంతో మూడో సీజన్ ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ మరింత భారీగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనోజ్ తెలిపారు. మరింత హైప్ పెంచేశారు.
సంబంధిత కథనం