Manoj Bajpai on RGV: ఇండియాలో సినిమాలు తీసే విధానాన్నే మార్చేసిన ఘనత ఆర్జీవీదే: మనోజ్ బాజ్‌పాయీ
Manoj Bajpai on RGV: ఇండియాలో సినిమాలు తీసే విధానాన్నే మార్చేసిన ఘనత ఆర్జీవీదే అని అన్నాడు మనోజ్ బాజ్‌పాయీ. తన లేటెస్ట్ మూవీ సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై మూవీ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అతడు ఈ కామెంట్స్ చేశాడు.
Manoj Bajpai on RGV: మనోజ్ బాజ్‌పాయీ తెలుసు కదా. అతడో విలక్షణ నటుడు. అప్పుడెప్పుడో 25 ఏళ్ల కిందట టాలెంటెడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన సత్య సినిమాలో అతడు పోషించిన బీకూ మాత్రే పాత్రకు ఫిదా కాని వారు ఎవరూ ఉండరేమో. ఆ క్యారెక్టర్ తో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన మనోజ్.. ఇప్పుడదే ఆర్జీవీపై ప్రశంసలు కురిపిస్తున్నాడు.
అతడు తాజాగా సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై(Sirf Ek Bandaa Kaafi Hai) సినిమాలో నటించాడు. ఈ మూవీ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ టాలీవుడ్ లోని మీడియా కోసం సోమవారం (జూన్ 12) ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక షో చూడటానికి మనోజ్ బాజ్‌పాయీ కూడా హైదరాబాద్ వచ్చాడు.
ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. "రాము నా గాడ్ ఫాదర్. అతని మూవీ సత్య వల్లే నాకు స్టార్‌డమ్ వచ్చింది. ఈ విషయంలో నాతో చాలా మంది ఏకీభవించకపోవచ్చు కానీ సత్య మూవీతోనే ఇండియాలో సినిమాలు తీసే విధానాన్ని ఆర్జీవీ మార్చేశాడు" అని మనోజ్ అనడం విశేషం. ఆర్జీవీ వల్లే మిగతా డైరెక్టర్లు కూడా కొన్ని కఠినమైన, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సినిమాలు చేయగలుగుతున్నారని అన్నాడు.
"కాస్త డిఫరెంట్ సబ్జెక్టులతో డైరెక్టర్లు సినిమాలు చేయగలుగుతున్నారంటే అది కేవలం ఆర్జీవీ వల్లే. సినిమాల్లో డ్యాన్స్ లు, పాటలు లేకపోయినా అదే ఆసక్తితో చూస్తారని అతడు నిరూపించాడు" అని మనోజ్ చెప్పాడు. ఇక ఆర్జీవీ విషయానికి వస్తే.. ఈ మధ్యే అతడు హైదరాబాద్ లో డెన్ పేరుతో తన ఆఫీసును తెరిచి వార్తల్లో నిలిచాడు.
మనోజ్ నటించిన సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై మూవీ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ బాబా చుట్టూ తిరుగుతుంది. ఇందులో మనోజ్ ఓ అడ్వొకేట్ గా కనిపించాడు. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. అపూర్వ్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్