Manmohan Singh Biopic OTT: ఓటీటీలో మాజీ ప్రధానీ మన్మోహన్ సింగ్ బయోపిక్- 18 కోట్ల బడ్జెట్, 6 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
Manmohan Singh Biopic The Accidental Prime Minister OTT: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ బడ్జెట్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలపై లుక్కేద్దాం.
Manmohan Singh Biopic OTT Budget And Collections: భారత మాజీ ప్రధానమంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. డిసెంబర్ 26న రాత్రి 9 గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లు అధికారికంగా ప్రకటించారు. 92 ఏళ్ల వయసులో మరణించిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా విశిష్ట సేవలు అందించారు.
వివాదాలు ఎదుర్కొని
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రపంచం మెచ్చిన ఆర్థికమంత్రిగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. 2019లో విడుదలైన ఈ సినిమా పలు వివాదాలను ఎదుర్కొని మరి విడుదలైంది. 2018లో రూపొందిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రం 2019 జనవరి 11న థియేటర్లలో రిలీజ్ అయింది.
ఈ సినిమాను భారత విధాన విశ్లేషకుడు సంజయ బారు అనుభవాలు, జ్ఞాపకాల ఆధారంగా రాసిన "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్" పుస్తకంలోని పలు సంఘటనలను తీసుకుని తెరకెక్కించారు. ఈ మూవీకి విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహించగా.. మయాంక్ తివారి కథ అందించారు.
మన్మోహన్ సింగ్‌గా అనుపమ్ ఖేర్
ఈ సినిమాను రుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బోహ్ర బ్రదర్స్, పెన్ ఇండియా లిమిటెడ్ పతాకంపై జయంతిలాల్ గదా సంయుక్తంగా నిర్మించారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీలో మన్మోహన్ సింగ్ పాత్రలో కార్తికేయ 2 ఫేమ్, బాలీవుడ్ పాపులర్ నటుడు అనుపమ్ ఖేర్ యాక్ట్ చేశారు. మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ జీవించేశారు అని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇక 13వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్య గల సంఘటనలను ఈ మూవీలో చూపించారు. 2019 జనవరి 11న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ మూవీగా పోటీగా అదే రోజు విడుదలైన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే రోజున రూ. 4.5 కోట్లు వచ్చాయి.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ తర్వాత అంత ప్రభావాన్ని చూపలేకపోయింది. ప్రేక్షకులు ఉరి సినిమాకు మొగ్గు చూపడంతో ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ యావరేజ్‌గా నిలిచింది. ఫలితంగా రూ. 18 నుంచి 21 కోట్ల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా రూ. 31.57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
అలాగే, ఇండియాలో రూ. 22.65 కోట్లు కలెక్ట్ చేసిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ ఓవర్సీస్‌లో రూ. 2.83 కోట్లు రాబట్టింది. అనుపమ్ ఖేర్‌తోపాటు అక్షయ్ ఖన్నా (సంజయ బారు), అహానా కుమ్రా (ప్రియాంక గాంధీ), సుజానే బెర్నెర్ట్ (సోనియా గాంధీ), అర్జున్ మాథూర్ (రాహుల్ గాంధీ), అజిత్ సత్‌భాయ్ (పీవీ నరసింహారావు) ఇతర కీలక పాత్రలు పోషించారు.
రేటింగ్ అండ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
10కి 6 ఐఎమ్‌డీబీ రేటింగ్ తెచ్చుకున్న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ జీ5 ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కేవలం హిందీ భాషలోనే జీ5లో ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. పొలిటికల్ డ్రామా, మన్మోహన్ పదవికాలంలో జరిగిన సంఘనటలను తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మూవీపై ఓ లుక్కేయొచ్చు.