OTT Movies This Weekend: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి రానున్న ఈ 4 చిత్రాలను మిస్ అవొద్దండి!
OTT Movies This Weekend: ఓటీటీల్లోకి ఈ వారం మరికొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన మూవీస్ ఉన్నాయి. ఈ వీకెండ్‍లో మిస్ కాకుండా చూడాల్సిన 4 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

OTT Movies This Weekend: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ప్రతీ వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెడుతూనే ఉన్నాయి. ప్రేక్షకులను ఓటీటీల్లో కంటెంట్ అలరిస్తోంది. అలాగే.. ఈ వారం (మే తొలివారం) కూడా కొన్ని సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న ఈ 4 చిత్రాలను మిస్ కాకుండా చూడండి.
సైతాన్
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‍గణ్, తమిళ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన సైతాన్ సినిమా థియేటర్లలో భారీ బ్లాక్‍బస్టర్ అయింది. మార్చి 8న రిలీజైన ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిలర్ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ మూవీలో జ్యోతిక, జానకి బోడివాలా కూడా ప్రధాన పాత్రలు చేశారు. సుమారు రూ.200 కోట్లకు పైగా ఈ మూవీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు సైతాన్ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తోంది.
సైతాన్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 3వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, మే 3వ తేదీన అర్ధరాత్రి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. సైతాన్ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. జియోస్టూడియోస్, దేవ్‍గణ్ ఫిల్మ్స్, పనోరమ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించారు.
మంజుమ్మల్ బాయ్స్
మలయాళ బ్లాక్‍బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ చిత్రం కూడా ఈ వీకెండ్‍లో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మే 5వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఫిబ్రవరి 22న మలయాళం థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. రూ.200కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు దక్కించుకుంది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లతో ఆశ్చర్యపరిచింది.
మంజుమ్మల్ బాయ్స్ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బసీ, బాలు వర్గీస్, గణపతి పడువల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని పవర ఫిల్మ్స్ నిర్మించగా.. సుషీన్ శ్యామ్ సంగీతం అందించారు. తెలుగులోనూ థియేటర్లలో ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్ మూవీకి మే 5 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో చూసేయండి.
సిద్ధార్థ్ రాయ్
తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ సిద్ధార్థ్ రాయ్ మే 3వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన దీపక్ సరోజ్.. ఈ చిత్రంతో హీరోగా మారారు. ఈ మూవీలో దీపక్ సరసన తన్వి నేగి హీరోయిన్‍గా నటించారు. యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. అయితే, అంచనాలను నిలుపుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈ వీకెండ్‍లో మే 3న సిద్ధార్థ్ రాయ్ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
వోంకా
హాలీవుడ్ మ్యూజిక్ ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘వోంకా’ మే 3వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. 2023లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. వోంకా సినమాలో తిమోతీ చాలామెట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని మే 3 నుంచి జియోసినిమాలో చూడొచ్చు.
మే 1వ తేదీన సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హీరామండి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ వీకెండ్‍లో చూసేందుకు ఇది కూడా బెస్ట్ ఆప్షన్.