Manjummel Boys vs Ilaiyaraaja: హక్కులు కొనే ఆ పాట వాడుకున్నాం: ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ కౌంటర్-manjummel boys producer says they bought the rights of that kammani song to use in the movie ilaiyaraja notice ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manjummel Boys Vs Ilaiyaraaja: హక్కులు కొనే ఆ పాట వాడుకున్నాం: ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ కౌంటర్

Manjummel Boys vs Ilaiyaraaja: హక్కులు కొనే ఆ పాట వాడుకున్నాం: ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ కౌంటర్

Hari Prasad S HT Telugu
May 24, 2024 05:29 PM IST

Manjummel Boys vs Ilaiyaraaja: మంజుమ్మల్ బాయ్స్ క్లైమ్యాక్స్ లో కమ్మనీ నీ ప్రేమ లేఖలే పాటను హక్కులు కొనుగోలు చేసిన తర్వాతే సినిమాలో వాడుకున్నామంటూ ఇళయరాజా నోటీసులకు ప్రొడ్యూసర్ కౌంటర్ ఇచ్చాడు.

హక్కులు కొనే ఆ పాట వాడుకున్నాం: ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ కౌంటర్
హక్కులు కొనే ఆ పాట వాడుకున్నాం: ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ కౌంటర్

Manjummel Boys vs Ilaiyaraaja: మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ లో తాను కంపోజ్ చేసిన పాటను తన అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ఆ టీమ్ కు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలుసు కదా. దీనిపై తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ కౌంటర్ ఇచ్చాడు. సదరు మ్యూజిక్ కంపెనీల నుంచి హక్కులు కొనుగోలు చేసిన తర్వాతే ఈ పాటను వాడుకున్నట్లు చెప్పాడు.

హక్కులు కొనే వాడుకున్నాం

గుణ మూవీలోని సూపర్ హిట్ కమ్మనీ నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే పాటను మంజుమ్మల్ బాయ్స్ మూవీలో వాడారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్ లో ఈ ప్రేమికుల పాటను స్నేహితుల మధ్య బంధాన్ని సూచించేలా వాడిన తీరు గూస్ బంప్స్ తెప్పించింది. మొత్తం సినిమా ఒకెత్తయితే.. క్లైమ్యాక్స్ లో ఈ పాట రావడం మరొక ఎత్తు. ఇదే సినిమాను బ్లాక్ బస్టర్ చేసింది.

అయితే ఈ పాటను తన అనుమతి లేకుండానే సినిమాలో వాడుకున్నారని ఈ సాంగ్ కంపోజ్ చేసిన ఇళయరాజా మంజుమ్మల్ బాయ్స్ టీమ్ కు నోటీసులు పంపించాడు. దీనిపై తాజాగా ఆ మూవీ ప్రొడ్యూసర్లు స్పందించాడు. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన షాన్ ఆంథోనీ దీనిపై స్పందించాడు. ఈ పాటను ఆయా మ్యూజిక్ కంపెనీల అనుమతితో వాడుకున్నట్లు చెప్పాడు.

"తెలుగులో ఒక కంపెనీకి ఈ పాటపై హక్కులు ఉన్నాయి. మిగతా భాషల్లో మరో సంస్థకు ఉన్నాయి. ఈ పాటకు ఓనర్లు అయిన పిరమిడ్, శ్రీదేవి సౌండ్స్ నుంచి మేము హక్కులు పొందాము" అని ఆంథోనీ వివరించాడు. తమిళ పాటకే కాదు.. మంజుమ్మల్ బాయ్స్ రిలీజైన అన్ని భాషల్లోనూ ఈ పాట కోసం హక్కులు పొందినట్లు అతడు తెలిపాడు. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నటించిన సౌబిన్ షాహిర్, అతని తండ్రి బాబు షాహిర్ కూడా ఈ సినిమా సహ నిర్మాతలుగా ఉన్నారు.

ఇళయరాజా ఏమన్నాడంటే?

అసలు మంజుమ్మల్ బాయ్స్ మొత్తం కొడైకెనాల్లోని గుణ గుహల చుట్టే తిరుగుతుంది. 2006లో అక్కడికి స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు లోతైన గుహలో పడిపోగా.. అతన్ని ఎలా రక్షించారన్నదే ఈ సినిమా. అయితే ఈ గుహలను గుణ గుహలని పిలవడానికి అక్కడ గుణ మూవీ షూటింగ్ జరగడమే. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్.

అందులోని కమ్మనీ నీ ప్రేమ లేఖలే పాట మరో సంచలనం. ఆ పాటను ఈ మంజుమ్మల్ బాయ్స్ లో డైరెక్టర్ చిదంబరం వాడుకున్నాడు. ఈ మూవీ రిలీజై బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులు బ్రేక్ చేసి ఓటీటీలోనూ దుమ్ము రేపుతున్న వేళ ఇళయరాజా స్పందించాడు. తన అనుమతి లేకుండా ఈ పాట ఎలా వాడుకున్నారంటూ ఆ టీమ్ కు నోటీసులు పంపించాడు.

ఈ పాటను ఇళయరాజాకు ఓ ట్రిబ్యూట్ గా వాడారా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఓ సినిమాలో వాడిన పాటను మరో సినిమాలో వాడాలంటే అవసరమైన న్యాయ ప్రక్రియలను ఫాలో కావాల్సిందే అని ఇళయారాజ లీగల్ కౌన్సెల్ శరవణన్ అన్నాదురై చెప్పాడు. మరి మంజుమ్మల్ బాయ్స్ టీమ్ ఇచ్చిన ఈ సమాధానానికి ఇళయరాజా ఎలా స్పందిస్తాడో చూడాలి.

Whats_app_banner