Manjummel Boys OTT: మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆరోజే! ప్లాట్‍ఫామ్ ఏదంటే..-manjummel boys ott release date this malayalam survival thriller film set to stream on disney hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Manjummel Boys Ott Release Date This Malayalam Survival Thriller Film Set To Stream On Disney Hotstar

Manjummel Boys OTT: మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆరోజే! ప్లాట్‍ఫామ్ ఏదంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 26, 2024 03:02 PM IST

Manjummel Boys OTT Release Date: మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన మంజుమెల్ బాయ్స్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందో సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

Manjummel Boys OTT: మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆరోజే! ప్లాట్‍ఫామ్ ఏదంటే..
Manjummel Boys OTT: మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆరోజే! ప్లాట్‍ఫామ్ ఏదంటే..

Manjummel Boys OTT Release: మంజుమెల్ బాయ్స్ సినిమా భారీ కలెక్షన్లతో రికార్డులను బద్దలుకొడుతోంది. రూ.200 కోట్ల కలెక్షన్ల మార్కు దాటిన తొలి మలయాళ మూవీగా చరిత్ర సృష్టించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా దుమ్మురేపుతోంది. తక్కువ బడ్జెట్‍తోనే రూపొందిన ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచి అంచనాలను దాటేసి ఆశ్చర్యపోయేలా భారీ హిట్ అయింది. ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. ఈ మంజుమెల్ బాయ్స్ మూవీ ఇక ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే!

మంజుమెల్ బాయ్స్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ విషయంలో ఆరంభంలో కాస్త సందిగ్ధత నడిచింది. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఏప్రిల్ 5వ తేదీన హాట్‍స్టార్ ఓటీటీలో మంజుమెల్ బాయ్స్ మూవీ స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం బయటికి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఏప్రిల్ 5వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్‌లో మంజుమెల్ బాయ్స్ మలయాళంతో పాటు తెలుగు వెర్షన్‍లో వస్తుందా అనేది సస్పెన్స్‌గా ఉంది. తెలుగు వెర్షన్‍ను థియేటర్లలో రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది. దీంతో ఏప్రిల్ 5న మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది.

మొత్తంగా.. మంజుమెల్ బాయ్స్ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది వేచిచూస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ నిరీక్షణ తీరుతుందనే అంచనాలు బయటికి వస్తున్నాయి.

మంజుమెల్ బాయ్స్ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. ఈ మూవీని థ్రిల్లింగ్‍గా తెరకెక్కించిన ఆయనపై ప్రశంసలు వస్తున్నాయి. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరున్ కురియన్, ఖాలీద్ రహమాన్, చందూ సలీం కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మంజుమెల్ బాయ్స్ కలెక్షన్లు

మంజుమెల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.213 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. రూ.200 కోట్ల గ్రాస్ దాటిన తొలి మలయాళ మూవీగా రికార్డులకెక్కింది. ఈ చిత్రానికి కేరళలో సుమారు రూ.75కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ఎక్కువగా తమిళనాడులోని కొడైకెనాల్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కింది. దీంతో తమిళ వెర్షన్‍లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. తమిళనాడులో ఇప్పటికే రూ.60కోట్ల మార్కును ఈ చిత్రం దాటేసింది. విదేశాల్లోనూ మంజుమెల్ బాయ్స్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే..

కొందరు స్నేహితుల గ్యాంగ్.. తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‍లోని గుణ గుహలకు విహారయాత్రకు వెళతారు. ఆ సమయంలో ఆ గ్యాంగ్‍లోని ఓ యువకుడు ప్రమాదంలో పడతాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో ఆ గ్రూప్‍లోని స్నేహితులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యానేదే మంజుమెల్ బాయ్స్ సినిమాలో ఉంటుంది. ఈ మూవీ ఆద్యంతం థ్రిల్లింగ్‍గా ఉత్కంఠభరితంగా సాగుతుంది.

IPL_Entry_Point