Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్‍పై మళ్లీ బజ్.. ఆరోజున రానుందా!
Manjummel Boys OTT Release: మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగులోనూ థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో మళ్లీ ఓ డేట్‍పై బజ్ నడుస్తోంది.

Manjummel Boys OTT Release: మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఆ ఇండస్ట్రీలో ఆల్‍టైమ్ రికార్డులను తిరగరాసింది. హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ థియేటర్లలోకి ఏప్రిల్ 6న థియేటర్లలోకి వచ్చింది. అంచనాలకు మించి తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. థియేట్రికల్ రన్ ఇంకా సాగుతుండటంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.
మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ కొన్ని తేదీలపై ప్రచారం జరిగింది. అయితే, అలా జరగలేదు. ఆలస్యమైంది. అయితే, తాజాగా మంజుమ్మల్స్ బాయ్స్ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది.
ఈరోజున రానుందా!
మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దగ్గర ఉన్నాయి. ఈ చిత్రాన్ని మే 3వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నిర్ణయించిందని సమాచారం బయటికి వచ్చింది. మే 3న మలయాళం, తెలుగుతో పాటు మరిన్ని డబ్బింగ్ భాషల్లో ఈ చిత్రాన్ని హాట్‍స్టార్ తీసుకొస్తుందని బజ్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి మే 3న అయినా ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందా.. మరేమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి.
మంజుమ్మల్ బాయ్స్ ఆల్ టైమ్ రికార్డ్ ఇదే
అత్యధిక గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్న మలయాళ సినిమాగా మంజుమ్మల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి మలయాళ మూవీగా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారు రూ.226 కోట్ల వసూళ్లు వచ్చాయి.
మలయాళంలో రికార్డులను సృష్టించిన ఈ సినిమా.. తెలుగులోనూ మంచి వసూళ్లను సాధిస్తోంది. ఏప్రిల్ 6న మంజుమ్మల్ బాయ్స్ చిత్రం తెలుగు వెర్షన్ వచ్చింది. ఈ మూవీకి అంచనాల కంటే తెలుగులో అధిక వసూళ్లు వస్తున్నాయి. కొన్ని థియేటర్లు కూడా యాడ్ అయ్యాయి. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాలు పోటీలో ఉన్నా.. మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులో మంచి ఆదరణే దక్కించుకుంటోంది.
మంజుమ్మల్ బాయ్స్ మూవీ తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‍లోని గుణ గుహల బ్యాక్‍డ్రాప్‍లో సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చింది. డైరెక్టర్ చిదంబరం ఈ చిత్రాన్ని ఉత్కంఠభరితంగా.. థ్రిల్లింగ్‍గా ఉండేలా తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరున్ కురియన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా ప్రశంసలను పొందుతోంది.
మంజుమ్మల్ బాయ్స్ మూవీని పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించారు. సుషిన్ శ్మాం సంగీతం అందించిన ఈ చిత్రానికి సైజూ ఖాలిద్ సినిమాటోగ్రఫీ చేశారు.
టాపిక్