Horror OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన శ‌క్తి హీరోయిన్ హార‌ర్ మూవీ!-manjari fadnis adrushya movie lands on ott ritesh deshmukh horror thriller film streaming on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Ott: థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన శ‌క్తి హీరోయిన్ హార‌ర్ మూవీ!

Horror OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన శ‌క్తి హీరోయిన్ హార‌ర్ మూవీ!

Nelki Naresh Kumar HT Telugu
Published Feb 08, 2025 05:24 PM IST

Horror OTT: ఎన్టీఆర్ శ‌క్తి ఫేమ్ మంజ‌రి ఫ‌డ్నీస్ హీరోయిన్‌గా న‌టించిన మ‌రాఠీ మూవీ అదృశ్య థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

హార‌ర్ ఓటీటీ
హార‌ర్ ఓటీటీ

Horror OTT: ఎన్టీఆర్ శ‌క్తి సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టించింది మంజ‌రి ఫ‌డ్నీస్‌. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, మ‌ల‌యాళంతో పాటు ప‌లు భాష‌ల్లో సినిమాలు చేసింది.. మంజ‌రి ఫ‌డ్నీస్ హీరోయిన్‌గా న‌టించిన మ‌రాఠీ మూవీ అదృశ్య థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. మ‌రాఠీతో పాటు హిందీ భాష‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

థ్రిల్ల‌ర్ క‌థాంశంతో...

హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన అదృశ్య మూవీలో పుష్క‌ర్ జాగ్ హీరోగా న‌టించాడు. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. స్పానిష్ మూవీ జూలియ‌స్ ఐస్‌ ఆధారంగా అదృశ్య మూవీ తెర‌కెక్కింది. క‌బీర్ లాల్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అదృశ్య క‌థ ఇదే...

అదృశ్య మూవీలో మంజ‌రి ఫ‌డ్నీస్ డ్యూయ‌ల్ రోల్ చేసింది. స‌యాలి, సానిక ట్విన్ సిస్ట‌ర్స్‌. స‌యాలి ఉరి వేసుకొని చ‌నిపోతుంది. స‌యాలి సూసైడ్ చేసుకుంద‌ని పోలీసులు చెబుతారు. సానిక మాత్రం త‌న సోద‌రి హ‌త్య చేయ‌బ‌డింద‌ని అంటుంది. స‌యాలి హ‌త్య వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించ‌డం మొద‌లుపెడుతుంది? ఈ క్ర‌మంలో సానిక‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి? అస‌లు స‌యాలి ఎలా చ‌నిపోయింది? ఆమెను చంపింది ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

అదృశ్య మూవీలో డ్యూయ‌ల్ రోల్‌లో మంజ‌రి ఫ‌డ్నీస్ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టింది. కానీ సినిమా మాత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

కే విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో...

సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం మూవీతోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మంజ‌రి ఫ‌డ్నీస్‌. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కే విశ్వ‌నాథ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన శుభ‌ప్ర‌దం సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. శ‌క్తి మూవీలో ఎన్టీఆర్ భార్య‌గా క‌నిపించింది. శ‌క్తి త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైంది మంజ‌రి ఫ‌డ్నీస్‌.

సూప‌ర్ హిట్ సినిమాల‌కు...

అదృశ్య ద‌ర్శ‌కుడు క‌బీర్ లాల్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా తెలుగుతో పాటు బాలీవుడ్‌లో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు ప‌నిచేశాడు. తెలుగులో భైర‌వ‌ద్వీపం, స్టైల్‌, అంద‌రివాడు, బాలీవుడ్‌లో తాళ్‌, క‌హోనా ప్యార్ హై, ప‌ర్‌దేశ్‌తో పాటు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌కు కెమెరామెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం