Ponniyin Selvan 2 Postponed: పొన్నియన్ సెల్వన్ -2 పోస్ట్‌పోన్ రూమర్స్ - అఖిల్ ఏజెంట్‌కు లైన్ క్లియర్
Ponniyin Selvan 2 Postponed: మణిరత్నం భారీ బడ్జెట్ మూవీ పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కానున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
Ponniyin Selvan 2 Postponed: విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం పొన్నియన్ సెల్వన్ -2 ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ ఘన విజయం నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ వాయిదా పడబోతున్నట్లు శుక్రవారం ప్రచారం మొదలైంది. ఏప్రిల్ నుంచి మే నెలకు రిలీజ్ డేట్‌ను షిప్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అన్ని భాషలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏప్రిల్ 28 లోగా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతోనే ఈ భారీ బడ్జెట్ సినిమాను పోస్ట్‌పోన్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా సమాచారం.
అఖిల్ ఏజెంట్‌కు ప్లస్...
పొన్నియన్ సెల్వన్ -2 పోస్ట్‌పోన్ వార్తలు నిజమైతే అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీకి లైన్ క్లియర్ అయినట్లే. అఖిల్ ఏజెంట్ సినిమా కూడా పొన్నియన్ సెల్వన్ సీక్వెల్‌తో పాటు ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.
ఒకవేళ పొన్నియన్ సెల్వన్ -2 వెనక్కి వెళ్లిపోతే అఖిల్‌కు దాదాపు సోలో రిలీజ్ దొరికే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళంలో ఏజెంట్‌కు థియేటర్లు ఎక్కువ సంఖ్యలో దొరుకుతాయని చెబుతున్నారు.
చోళ సామ్రాజ్య కథతో...
చోళ సామ్రాజ్యం ఇబ్బందుల్లో పడ్డట్టుగా చూపించి పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్‌ను ఎండ్ చేశారు మణిరత్నం. తమకు ఎదురైన ఇబ్బందులను పొన్నియన్ సెల్వన్‌తో పాటు కరికాళచోళుడు..వందిదేవన్‌తో సహాయంతో ఎలా ఎదుర్కొన్నారన్నది సీక్వెల్‌లో చూపించబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ -2లో విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యరాయ్, త్రిష కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.