Rajinikanth : పొన్నియ‌న్ సెల్వ‌న్ లో ర‌జ‌నీకాంత్ న‌టిస్తాన‌ని అడిగినా - మ‌ణిర‌త్నం కాద‌న్నాడ‌ట‌-mani ratnam clarity on rejecting rajinikanth s offer in ponniyin selvan
Telugu News  /  Entertainment  /  Mani Ratnam Clarity On Rejecting Rajinikanth's Offer In Ponniyin Selvan
మ‌ణిర‌త్నం, రజనీకాంత్
మ‌ణిర‌త్నం, రజనీకాంత్ (twitter)

Rajinikanth : పొన్నియ‌న్ సెల్వ‌న్ లో ర‌జ‌నీకాంత్ న‌టిస్తాన‌ని అడిగినా - మ‌ణిర‌త్నం కాద‌న్నాడ‌ట‌

18 September 2022, 9:46 ISTNelki Naresh Kumar
18 September 2022, 9:46 IST

Rajinikanth : పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 1 లో ఓ కీల‌క పాత్ర చేస్తాన‌ని మ‌ణిర‌త్నాన్ని అడిగిన అత‌డు కాద‌న్నాడ‌ని ఆడియో వేడుక‌లో ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించ‌డానికి గ‌ల కార‌ణాల్ని శ‌నివారం చెన్నైలో జ‌రిగిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో మ‌ణిర‌త్నం వెల్ల‌డించారు.

Rajinikanth : మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ చారిత్ర‌క చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 1 సెప్టెంబ‌ర్ 30న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. రచయిత క‌ల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా చోళ సామ్రాజ్య‌పు కాలం నాటి క‌థాంశంతో మ‌ణిర‌త్నం (Maniratnam) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో విక్ర‌మ్‌(vikram), కార్తి, జ‌యంర‌వి, త్రిష (Trisha) తో పాటు ప‌లువురు త‌మిళ అగ్ర‌న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌నున్నారు.

ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఐశ్వ‌ర్య‌రాయ్ (Aishwarya rai) త‌మిళంలో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. పొన్నియన్ సెల్వన్ లో పెరియా ప‌జువెట్టియార్ అనే పాత్ర‌ను తాను చేయాల‌ని అనుకున్న‌ట్లు ఆడియో వేడుక‌లో ర‌జ‌నీకాంత్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. కానీ మ‌ణిర‌త్నం త‌న రిక్వెస్ట్‌ను తిర‌స్క‌రించాడ‌ని ర‌జ‌నీకాంత్ చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ర‌జ‌నీకాంత్ కామెంట్స్‌పై శ‌నివారం మ‌ణిర‌త్నం క్లారిటీ ఇచ్చాడు. పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో ర‌జ‌నీకాంత్ న‌టిస్తాన‌ని త‌న‌ను ఆడిగిన మాట నిజ‌మేన‌ని అన్నాడు. ఇలాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలో ఓ చిన్న రోల్ లో ర‌జ‌నీకాంత్ క‌నిపిస్తే అత‌డి అభిమానులు అసంతృప్తిగా ఫీల‌య్యే అవ‌కాశం ఉంటుంద‌నే భ‌యంతోనే ర‌జ‌నీకాంత్ ఆఫ‌ర్‌ను తాను తిర‌స్క‌రించిన‌ట్లు మ‌ణిర‌త్నం తెలిపాడు.

ర‌జ‌నీకాంత్ చేస్తాన‌ని అడిగిన క్యారెక్ట‌ర్ లో శ‌ర‌త్ కుమార్ న‌టించాడు. చోళ సామ్రాజ్యంలోని కుట్ర‌లు, కుతంత్రాల‌ను ఆవిష్క‌రిస్తూ పొన్నియన్ సెల్వన్ సినిమా రూపొందుతోంది. ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన ఆరు నుంచి తొమ్మిది నెల‌ల్లో సెకండ్ పార్ట్‌ను రిలీజ్ చేస్తాన‌ని మ‌ణిర‌త్నం పేర్కొన్నాడు. ఈ సినిమాకు ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించాడు.