అమెరికాలో కన్నప్ప ప్రమోషన్స్.. రోడ్ షో, భారీ ఈవెంట్స్.. మంచు విష్ణు మాస్టర్ స్కెచ్.. ఏ రోజు నుంచి అంటే?-manchu vishnu plans to start kannappa promotions from america with road shows big events ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అమెరికాలో కన్నప్ప ప్రమోషన్స్.. రోడ్ షో, భారీ ఈవెంట్స్.. మంచు విష్ణు మాస్టర్ స్కెచ్.. ఏ రోజు నుంచి అంటే?

అమెరికాలో కన్నప్ప ప్రమోషన్స్.. రోడ్ షో, భారీ ఈవెంట్స్.. మంచు విష్ణు మాస్టర్ స్కెచ్.. ఏ రోజు నుంచి అంటే?

Sanjiv Kumar HT Telugu

మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా నుంచి భారీగా కన్నప్ప మూవీ ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. దీంతో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పూర్తి వివరాల్లోకి వెళితే..!

అమెరికాలో కన్నప్ప ప్రమోషన్స్.. రోడ్ షో, భారీ ఈవెంట్స్.. మంచు విష్ణు మాస్టర్ స్కెచ్.. ఏ రోజు నుంచి అంటే?

టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. త్వరలో ప్రేక్షకుల ముందుకు కన్నప్ప రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.

వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్

అలాగే, కన్నప్ప సినిమా నుంచి రిలీజయిన పాటలు అయితే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. అయితే, కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా పెంచాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

భారీ తారాగణం నటిస్తూ

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు కన్నప్ప సినిమాను నిర్మించారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మధుబాల వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు.

మంచు విష్ణు మాస్టర్ స్కెచ్

జూన్ 27 న కన్నప్ప సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విష్ణు మంచు కన్నప్ప ప్రమోషన్స్ పరంగా మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. కన్నప్ప ప్రమోషన్స్‌ను అమెరికా నుంచి ప్రారంభించనున్నారు. మే 8 నుంచి అమెరికాలో కన్నప్ప ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. దీంతో గ్రాండ్‌గా ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్‌ని చేయనున్నారు.

రోడ్ షోతో మొదలు

ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ చిత్రం కన్నప్ప రిలీజ్‌కి ముందే ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చరిత్ర సృష్టించనుందని మేకర్స్ చెబుతున్నారు. అమెరికాలోని న్యూ జెర్సీలో కన్నప్ప రోడ్ షోతో మొదలుపెట్టి ఆ తర్వాత డల్లాస్, లాస్ ఏంజిల్స్‌లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్

ఈ క్రమంలో సినిమాలోని ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ వర్కింగ్ విజువల్స్‌ను కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్‌కి చూపించనున్నారు. కన్నప్ప సినిమాని ఇండియాతో పాటు అమెరికాలో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మంచు విష్ణు.

కన్నప్ప మూవ్‌మెంట్‌తో

ఇప్పటికే కన్నప్ప సినిమా విజువల్స్, సినిమాలోని భక్తి భావాన్ని ప్రేక్షకులు గొప్పగా ఊహించుకుంటున్నారు. ఈ కన్నప్ప మూవ్‌మెంట్‌తో విష్ణు మంచు కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే చేయడం కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌కి గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.

కొత్త భక్తి భావం

కన్నప్ప ప్రయాణం మే 8 నుంచి ప్రారంభం కానుంది. ఒక కొత్త భక్తి భావం, కథ, సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు చూపించనున్నారు మంచు విష్ణు అండ్ టీమ్.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం