Ginna Trailer: జిన్నా ట్రైలర్ వచ్చేసింది.. మంచు విష్ణు అదరగొట్టేశాడుగా..!
Ginna Trailer Release: మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా అక్టోబరు 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ginna Trailer: టాలీవుడ్ హీరో మంచు విష్ణు గతేడాది మోసగాళ్లు చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయేసరికి ఇక తన ఆశలన్నీ తన తదుపరి చిత్రమైన జిన్నాపైనే పెట్టుకున్నాడు. తను హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇషాన్ సూర్య అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ వచ్చింది. జిన్నా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
దసరా కానుకగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తే ఆద్యందం వినోదాత్మకంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కామెడీకి హర్రర్‌ను జోడించినట్లు ట్రైలర్‌లో చూపించారు. ఇందులో మంచు విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. దీంతో థియేటర్లో నవ్వులు పూయడం ఖాయంగా అనిపిస్తోంది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇందులో గాలి నాగేశ్వరరావు అనే టెంట్‌హౌజ్ ఓనర్‌గా మంచు విష్ణు కనిపించబోతున్నాడు. బ్యాడ్‌లక్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అతడి జీవితంలోకి ఓ ఎన్ఆర్ఐ అమ్మాయి రాకతో ఎలాంటి మార్పులు వచ్చాయనే పాయింట్‌తో జిన్నా సినిమా తెరకెక్కింది.
జిన్నా సినిమాతో ఇషాన్ సూర్య దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. జి.నాగేశ్వరరరెడ్డి మూలకథను అందించిన ఈ సినిమాకు కోన వెంకట్ కథ,స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. మంచు విష్ణు సరసన సన్నీలియోన్,పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. మంచు విష్ణు హీరోగా నటిస్తూనే ఈ సినిమాను నిర్మించాడు. ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోనీ హీరోయిన్‌లుగా నటించారు. అక్టోబరు 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.
సంబంధిత కథనం