Manchu Vishnu Interview: మంచు విష్ణు వచ్చే నెలలో ప్రతిష్టాత్మక మూవీ కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా అతడు హిందుస్థాన్ టైమ్స్ తమిళంకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతడు ఏమన్నాడో చూడండి.
కథలో ఏముందో చెప్పలేం. కన్నప్పలో ఇంటర్వెల్ బ్రేక్ కు 25 నిమిషాల ముందు ఒక ఎపిసోడ్ మొదలవుతుంది. అక్కడ అసలు హైప్ మొదలవుతుంది. ఆ తర్వాత సినిమా మొత్తం ఆ హైప్ అలాగే కొనసాగుతుంది.
ఇదంతా ఆ శివుని వల్లనే అని నేను నమ్ముతున్నాను. మేము అనుకున్నాము, అతను చేసాడు, అంతే.
కన్నప్ప కథను ఇంతకు ముందు చాలాసార్లు చిత్రీకరించారు. ఆ సినిమాలు తీసిన వారు ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో రాసుకొని అందుకు తగినట్లు వాటిని తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం అదే.
కన్నప్పగా ఓ నటుడిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశాను. ఇది నా కోసం నేను రాసుకున్న కథ. ఈ సినిమాలో కన్నప్పగా జీవించాను. నా కన్నప్ప వెర్షన్ ఎలా ఉందో మీరే చూడాలి.
నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు, నేను ఎదుర్కొన్న సవాళ్లు ఏవీ సవాళ్లుగా అనిపించవు. ఇదంతా దేవుడు నడుపుతున్నాడు.
బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా నాకు ముఖ్యం. కానీ ఈ సినిమా ఇంత, అంత కలెక్ట్ చేస్తుందని నేను చెప్పలేను. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు దీనిని ఎంతగా ఆదరిస్తారు, ఎంత సపోర్ట్ వస్తుంది అనే దానిపైనే కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. కానీ అది నా చేతుల్లో లేదు.
'కన్నప్ప' తెలుగులో చారిత్రక నవలకు రీమేక్. ఈ చిత్రానికి ప్రముఖ మహాభారత సిరీస్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శివభక్తుడైన కన్నప్ప చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటించాడు.
ఈ చిత్రంలో మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరులు నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.
సంబంధిత కథనం