Manchu Vishnu Ginna Teaser: జిన్నా టైమ్ స్టార్ట్ అయ్యింది - మంచు విష్ణు జిన్నా టీజర్ రిలీజ్
Manchu Vishnu Ginna Teaser: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉందంటే...
Manchu Vishnu Ginna Teaser: జిన్నా సినిమాతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి మంచు విష్ణు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. బ్యాడ్ టైమ్ కు కేరాఫ్ అడ్రస్ గా టీజర్ లో మంచు విష్ణు క్యారెక్టర్ ను పరిచయం చేశారు. టెంట్ హౌజ్ ఓనర్ గా ఊరి నిండా అప్పులతో జిన్నా సతమతమవుతున్నట్లుగా చూపించడం ఆకట్టుకుంటోంది.
మనల్ని అప్పుల నుంచి బయటపడేయాలంటే సాక్షాత్తూ మహాలక్ష్మి పచ్చ బస్సెక్కి నేరుగా మన రంగంపేటలో దిగాలి అంటూ చిత్తూరు యాసలో విష్ణు చెప్పిన డైలాగ్ తో సన్నీ లియోన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినట్లుగా చూపించారు. ఆమె క్యారెక్టర్ తో టీజర్ లో సస్పెన్స్ క్రియేట్ చేశారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ తో పాటు హారర్ అంశాలతో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిన్నా సినిమాకు ఇషాన్ సూర్య దర్వకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కరెంట్ తీగ తర్వాత తెలుగులో సన్నీ లియోన్ చేస్తున్న సినిమా ఇది.
జిన్నా సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. జిన్నా సినిమాలో హీరోగా నటిస్తూనే మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు . విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా ఈ సినిమాలో ఓ పాట పాడారు.