Manchu Vishnu: మంచు విష్ణు కోరికను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంగీకరిస్తారా!
Manchu Vishnu: స్పిరిట్ సినిమాలో తాను నటించాలని మంచు విష్ణు అనుకుంటున్నారు. తన కోరికను కూడా బయటపెట్టారు. ఆ వివరాలు ఇవే..
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’తో పాటు డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ మూవీ చేస్తున్నారు. అయితే, సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయనున్న స్పిరిట్ చిత్రానికి క్రేజ్ మరో రేంజ్‍లో ఉంది. షూటింగ్ మొదలుకాక ముందే ఈ చిత్రంపై హైప్ తారస్థాయికి చేరింది. స్పిరిట్ చిత్రంలో తాను భాగం కావాలని హీరో మంచు విష్ణు అనుకుంటున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
అప్లై చేశా.. వేచిచూడాలి..
స్పిరిట్ సినిమాలో చేసేందుకు నటీనటులు కావాలంటూ సందీప్ రెడ్డి వంగా ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ మూవీలో నటించాలనుకునే వారు వీడియో రికార్డ్ చేసి ఈమెయిల్‍కు పంపాలంటూ ఓ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీనికి మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.
స్పిరిట్‍లో పాత్ర కోసం తాను అప్లై చేసుకున్నానని, ఏం జరుగుతుందో వేచిచూడాలని మంచు విష్ణు ట్వీట్ చేశారు. తాను క్యాస్టింగ్ కాల్‍కు దరఖాస్తు చేసుకున్నా అని కన్ఫర్మ్ చేశారు.
విష్ణు కోరిక నెరవేరుతుందా!
మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప చిత్రంలో ప్రభాస్ ఓ క్యామియో రోల్ చేశారు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఉన్న స్పిరిట్ చిత్రంలో తాను నటించాలని అనుకుంటున్నట్టు తన ఆశను మంచు విష్ణు బయటపెట్టారు. తుది నిర్ణయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల్లోనే ఉంటుంది. మరి స్పిరిట్ మూవీలో నటించాలనుకుంటున్న విష్ణు ఆశను సందీప్ నెరవేరుస్తారేమో చూడాలి.
కన్నప్ప చిత్రంలో నటించేందుకు ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని మంచు విష్ణు ఇటీవలే చెప్పారు. ఆ మూవీలో రుద్ర పాత్రను రెబల్ స్టార్ పోషించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ వచ్చింది. మెడలో రుద్రాక్షలు, నుదుటన నామాలతో ఓ సాధువుగా ప్రభాస్ లుక్ ఉంది. శివుడి అంశగా ఈ పాత్ర ఉండనుంది. మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన కన్నప్పను ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. శివుడి భక్తుడు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషించారు విష్ణు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రభాస్ వరుస చిత్రాలు
ప్రభాస్ లైనప్‍లో ది రాజాసాబ్, హనూ రాఘవపూడితో చిత్రం, స్పిరిట్‍తో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా రెబల్ స్టార్ చేయాల్సి ఉంది. ‘ది రాజాసాబ్’ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. హారర్ రొమాంటిక్ కామెడీ మూవీగా మారుతీ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్ పోషించారు ప్రభాస్. హను రాఘవపూడితో పీరియడ్ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నారు రెబల్ స్టార్. ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ పనులను సందీప్ ఇప్పటికే పూర్తి చేశారు. ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటించనున్నారు.
సంబంధిత కథనం