Manchu Vishnu in Malayalam Remake: మ‌ల‌యాళ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న మంచు విష్ణు-manchu vishnu confirms android kunjappan telugu remake ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Vishnu In Malayalam Remake: మ‌ల‌యాళ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న మంచు విష్ణు

Manchu Vishnu in Malayalam Remake: మ‌ల‌యాళ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న మంచు విష్ణు

Manchu Vishnu in Malayalam Remake: మ‌ల‌యాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు హీరో మంచు విష్ణు. ఆ సినిమా ఏదంటే...

మంచు విష్ణు

Manchu Vishnu in Malayalam Remake: ప్ర‌స్తుతం తెలుగులో రీమేక్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్ (Godfather)సినిమా మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ ఆధారంగా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ప‌దిరోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ప‌లు మ‌ల‌యాళ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి.

తాజాగా ఈ జాబితాలో మ‌రో సినిమాచేరింది. మ‌ల‌యాళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ఆండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్ వెర్ష‌న్ 5.25 సినిమాను తెలుగులో మంచు విష్ణు రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్‌గా మంచు విష్ణు ప్ర‌క‌టించాడు.

జిన్నా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా శ‌నివారం ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించారు మంచు విష్ణు. ఈ సంద‌ర్భంగా ఆండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్ సినిమాను రీమేక్ చేస్తున్నారా అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు అవును అంటూ విష్ణు స‌మాధానం ఇచ్చాడు. ఈ సినిమాలో మోహ‌న్‌బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఓ వృద్ధుడికి రోబోకు మ‌ధ్య అనుబంధం నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ కామెడీ డ్రామాగా ఆండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్ సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. . ఈ సినిమాలో సూర‌జ్ వెంజ‌ర‌మూడు న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అత‌డి పాత్ర‌ను తెలుగు వెర్ష‌న్‌లో మోహ‌న్‌బాబు (Mohanbabu) చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

మోహ‌న్‌బాబు కొడుకు పాత్ర‌లో మంచు విష్ణు న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

కాగా మంచు విష్ణు హీరోగా న‌టించిన జిన్నా(Ginna) సినిమా దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 21న రిలీజ్ కానుంది.ఈ సినిమాకు ఈషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.