Manchu Vishnu: ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటీ? క్లియర్‌గా చూపించబోతున్నాం.. మంచు విష్ణు కామెంట్స్
Manchu Vishnu Comments On Kannappa At Bangalore: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన సినిమా కన్నప్ప. తాజాగా కన్నప్ప మూవీ ప్రమోషన్స్‌ను బెంగళూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
Manchu Vishnu Comments: టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
బెంగళూరులో ప్రమోషన్స్ ప్రారంభం
ఇప్పటికే కన్నప్ప చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కన్నప్ప మూవీ ప్రమోషన్స్‌ను ఇటీవల బెంగళూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మళ్లీ ఈ కథ చెప్పబోతున్నాం
హీరో విష్ణు మంచు మాట్లాడుతూ.. "కన్నప్ప ప్రమోషన్స్‌ను కన్నడ నేల నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు మొదటి సారిగా కన్నప్ప చిత్రాన్ని చేశారు. ఆ తరువాత శివ రాజ్ కుమార్ గారు కూడా చేశారు. తెలుగులో స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు గారు బాపు రమణ దర్శకత్వంలో కన్నప్ప చేశారు. మళ్లీ ఇప్పుడు మేం కన్నప్ప కథను చెప్పబోతోన్నాం" అని అన్నారు.
బుల్లితెరపై ఓ లెజెండ్
"ఈ తరానికి కన్నప్ప ఎవరు? ఆయన కథ ఏంటి? ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి? అని క్లియర్‌గా ఈ కన్నప్ప సినిమాతో చూపించబోతున్నాం. ముఖేష్ కుమార్ సింగ్ బుల్లితెరపై ఓ లెజెండ్. మహాభారతం సీరియల్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ఇండియా నుంచి టీంను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లాం. ఇతర దేశాల నుంచి కూడా టెక్నీషియన్లను తీసుకొచ్చాం" అని మంచు విష్ణు తెలిపాడు.
మొదట ఆయనకే ఫోన్ చేశాను
"శరత్ కుమార్ గారు సెట్‌కి ఆన్ టైంకి వచ్చేవారు. ప్రభుదేవా అన్న అడిగిన వెంటనే మా ప్రాజెక్ట్ కోసం వచ్చారు. అసలు ఈ కథను అనుకున్నప్పుడు రాక్ లైన్ వెంకటేష్ గారికే ఫోన్ చేసి చెప్పాను. అద్భుతంగా ఉంటుంది చేయ్ అని ధైర్యాన్ని ఇచ్చారు. శివుని ఆజ్ఞతోనే ఈ చిత్రం ప్రారంభమైందని అనిపిస్తుంది" అని మంచు విష్ణు పేర్కొన్నాడు.
శివుని ఆశీస్సులతో వస్తున్నాం
"నాకు ఈ కన్నప్ప ఎంతో ప్రత్యేకం. ఆర్ఆర్ అవ్వక ముందే రాక్ లైన్ వెంకటేష్ గారు ఈ మూవీని చూశారు. అద్భుతంగా వచ్చిందని భరోసానిచ్చారు. ఇక ఆ శివుని ఆశీస్సులతో మేం ఏప్రిల్ 25న రాబోతున్నాం" అని మంచు విష్ణు తన స్పీచ్ ముగించాడు.
పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ రాక్ లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ.. "కన్నప్ప చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. మోహన్ బాబు గారు, విష్ణు కలిసి ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు నటించారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్ ఇలా అద్భుతమైన క్యాస్టింగ్ ఉంది. ప్రస్తుతం సినిమాను తీయడం కంటే మార్కెటింగ్ చేసుకోవడం చాలా కష్టం. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
సంబంధిత కథనం