Manchu Vishnu: త్రివిధ దళాల కుటుంబాల కోసం మంచు విష్ణు ముందడుగు.. సైనికుల పిల్లలకు 50 శాతం స్కాలర్‌షిప్!
Manchu Vishnu Announces 50 Percent Scholarship To Army Children: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మంచి మనసు చాటుకున్నారు. దేశం కోసం త్యాగాలు చేసే త్రివిధ దళాల కుటుంబాల కోసం మంచు విష్ణు ముందడుగు వేశారు. సైనికుల పిల్లల కోసం 50 శాతం స్కాలర్‌షిప్‌ను ప్రకటించారు.
Manchu Vishnu Announces 50 Percent Scholarship To Army Children: మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ విష్ణు మంచు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు.
త్రివిధ దళాలలోని తెలుగు వారిని
త్రివిధ దళాలలో పని చేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు, వారి పిల్లలకు 50% స్కాలర్‌షిప్‌ను అందించబోతున్నట్టుగా విష్ణు మంచు ప్రకటించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుంది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు.
గౌరవ సూచికంగా
ఈ మేరకు మంచు విష్ణు మాట్లాడుతూ.. "మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవ సూచికంగా, వారికి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దేశానికి నిస్వార్థంగా సేవ చేసే వారి సంక్షేమానికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాను. ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు మా నిర్ణయం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను" అని మంచు చెప్పారు.
120 మంది అనాథ పిల్లలను
సమాజానికి తిరిగి ఏదైనా అందించాలనే లక్ష్యంతో విష్ణు మంచు ఈ మహత్కర కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇదే కాకుండా దాదాపు రెండేళ్ల క్రితం తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను విష్ణు మంచు దత్తత తీసుకున్నారు. వారందరికీ మెరుగైన విద్య, వైద్యం అందేలా విష్ణు మంచు అన్ని ఏర్పాట్లను చేశారు.
ఏప్రిల్ 25న కన్నప్ప
ఇక తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఇలా సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్‌షిప్‌ను ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మంచు విష్ణు. ఇదిలా ఉంటే, మంచు విష్ణు ప్రస్తుతం నటించిన సినిమా కన్నప్ప. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు.
భారీ తారాగణం
కన్నప్ప సినిమాను బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అలాగే, ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ నటించారు. ఇక కన్నప్ప సినిమాతో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా పరిచయం కానుంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన ప్రీతి ముకుందన్‌ను కన్నప్ప హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. కన్నప్ప నుంచి విడుదలైన ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కన్నప్ప సినిమాను ఇండియావైడ్‌గా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెంగళూరులో కన్నప్ప ప్రమోషన్స్ ప్రారంభించగా.. ఇటీవల కేరళలో ఓ ఈవెంట్ నిర్వహించారు. కాగా ఈ సినిమాకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవరిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్