Manchu Manoj: అప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి: మంచు మనోజ్
Manchu Manoj: అన్నదమ్ముల బంధం గురించి హీరో మంచు మనోజ్ మాట్లాడారు. సోదరా సినిమా తొలి పాట లాంచ్ ఈవెంట్‍కు హాజరైన ఆయన ఈ విషయంపై స్పీచ్ ఇచ్చారు.
Manchu Manoj: సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సోదరా' సినిమా నుంచి తొలి పాట వచ్చేసింది. అన్నంటే దోస్తే సోదరా అంటూ ఈ పాట ఉంది. ఈ చిత్రంలో సంజోశ్ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నారు. సంపూర్ణేశ్, సంజోశ్ అన్నదమ్ములుగా ఈ సినిమాలో చేస్తున్నారు. ఇట్స్ బ్రొమాంటిక్ లవ్ స్టోరీ అనేది సోదరా చిత్రానికి క్యాప్షన్‍గా ఉంది. కాగా, సోదరా సినిమా తొలి పాట లాంచ్ ఈవెంట్‍కు హీరో మంచు మనోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడారు. తన అన్న మంచు విష్ణుతో మనోజ్‍కు విభేదాలు ఉన్నాయని కొంతకాలంగా పుకార్లు వస్తుండగా.. ఇలాంటి తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
అన్నదమ్ముల మధ్య అహాలు (ఈగో), అనవసరమైన గొడవలు ఉండకూడదని మంచు మనోజ్ అన్నారు. సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. “బ్రదర్స్ అనే రిలేషన్‍షిప్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య ఈగోలు, అనసరమైన విషయాలు వస్తాయో.. బంధం ముందుకు వెళ్లదు. బ్రదర్స్ మధ్య ఎప్పుడు ఈగోలు ఉండకూడదు. సమస్యలు ఉండకూడదు” అని మనోజ్ అన్నారు.
అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తే ఎవరో ఒకరు ఒక్కరు తగ్గి అయినా పరిష్కరించుకోవాలని మంచు మనోజ్ చెప్పారు. “ఒకరు తగ్గైనా.. బ్రదర్స్‌తో, సిస్టర్స్‌తో, ఫ్యామిలీతో ఉంటే అది ఎప్పుడైనా బాగా ఉంటుంది” అని మనోజ్ చెప్పారు. బ్రదర్స్, హ్యూమన్ ఎమోషన్స్ మీద సోదరా సినిమాను తీస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని మనోజ్ అన్నారు. మొత్తంగా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినా కొనసాగించకుండా పరిష్కరించుకోని కుటుంబంలా కలిసి ఉండాలని మనోజ్ చెప్పారు. గొడవలు ఉండే ఎవరో ఒకరు తగ్గాలని సూచించారు.
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయని కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ వివాహం చేసుకోగా.. ఆ వేడుకలో విష్ణు కనిపించలేదు. ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు బహిరంగంగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు. ఇద్దరూ గొడవ పడుతున్నట్టుగా ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. దీంతో విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఉన్నాయని పుకార్లు వచ్చాయి. ఈ విషయంపై మంచు ఫ్యామిలీ స్పందించలేదు.
2018 తర్వాత మంచు మనోజ్ సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే చిత్రం చేస్తున్నారు. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఓ షోకు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు మనోజ్.