Manchu Manoj: ర్యాంప్ ఆడిద్ధాం అంటోన్న మంచు మ‌నోజ్ - ఓటీటీ షో టైటిల్ రివీల్‌-manchu manoj re entry into tollywood with ott show ustad ramp aadiddam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Manchu Manoj Re Entry Into Tollywood With Ott Show Ustad Ramp Aadiddam

Manchu Manoj: ర్యాంప్ ఆడిద్ధాం అంటోన్న మంచు మ‌నోజ్ - ఓటీటీ షో టైటిల్ రివీల్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 20, 2023 06:00 AM IST

Manchu Manoj: మంచు మ‌నోజ్ కొత్త ఓటీటీ షో చేయ‌బోతున్నాడు.ఈ టాక్ షోకు ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్ధాం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

మంచు మ‌నోజ్
మంచు మ‌నోజ్

Manchu Manoj: మంచు మ‌నోజ్ త్వ‌ర‌లో టాక్ షోతో తెలుగు ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ షోకు ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టాక్‌, గేమ్ రెండు షోల‌ను మిక్స్ చేస్తూ టాక్ గేమ్ షోగా ర్యాంప్ ఆడిద్దాం ఉండ‌బోతున్న‌ట్లు మంచు మ‌నోజ్ తెలిపాడు. ఈ షోకు వ‌చ్చే సెల‌బ్రిటీల‌తో మాట్లాడిస్తూనే వారితో ర‌క‌ర‌కాల గేమ్స్ ఆడించ‌నున్న‌ట్లు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ టాక్ గేమ్ షో ఈ టీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. దీపావ‌ళి స్పెష‌ల్‌గా ఈ టీవీ నిర్వ‌హించిన మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు అనే కార్య‌క్ర‌మానికి మంచు మ‌నోజ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. తెలుగు ఫిమేల్ టాప్ యాంక‌ర్స్‌తో క‌లిసి సంద‌డిచేశాడు.

ఈ కార్య‌క్ర‌మంలో ర్యాంప్ ఆడిద్ధాం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని మంచు మ‌నోజ్‌ వెల్ల‌డించాడు. త్వ‌ర‌లోనే ఈ టాక్ గేమ్ షో స్ట్రీమింగ్ మొద‌లుకానున్న‌ట్లు తెలిసింది. గ‌త ఆరేళ్ల నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడు మంచు మ‌నోజ్‌. చివ‌ర‌గా 2017లో ఒక్క‌డు మిగిలాడు అనే సినిమా చేశాడు.

త్వ‌ర‌లోనే వాట్ ది ఫిష్ అనే సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఈ సినిమాకు వ‌రుణ్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.