Manchu Manoj Next Movie: ఐదేళ్ల త‌ర్వాత కొత్త‌ సినిమాను అనౌన్స్ చేసిన మంచు మ‌నోజ్ - డిఫ‌రెంట్ టైటిల్ ఫిక్స్‌-manchu manoj officially announced his next movie manchu manoj what the fish movie
Telugu News  /  Entertainment  /  Manchu Manoj Officially Announced His Next Movie Manchu Manoj What The Fish Movie
మంచు మ‌నోజ్
మంచు మ‌నోజ్

Manchu Manoj Next Movie: ఐదేళ్ల త‌ర్వాత కొత్త‌ సినిమాను అనౌన్స్ చేసిన మంచు మ‌నోజ్ - డిఫ‌రెంట్ టైటిల్ ఫిక్స్‌

20 January 2023, 10:49 ISTNelki Naresh Kumar
20 January 2023, 10:49 IST

Manchu Manoj Next Movie: ఐదేళ్ల గ్యాప్ త‌ర్వాత కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు మంచు మ‌నోజ్‌. వాట్ ద ఫిష్ పేరుతో ఓ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Manchu Manoj Next Movie: దాదాపు ఐదేళ్ల విరామం త‌ర్వాత సినిమాల్లోకి మంచు మ‌నోజ్ రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌న కొత్త సినిమాను శుక్ర‌వారం అనౌన్స్‌చేశాడు. వాట్ ద‌ ఫిష్ పేరుతో ఓ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. టైటిల్‌తో పాటు విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో మంచు మ‌నోజ్ వెన‌క్కి తిరిగి క‌నిపిస్తున్నాడు. పోస్ట‌ర్‌లో ఉన్న‌ కార్లు, బైక్‌లు మ‌నోజ్ నిల్చోన్న‌వైపు వ‌స్తోన్న‌ట్లుగా క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

టైటిల్‌తో పాటు మ‌నం మ‌నం బ‌రంపురం అనే క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంటోంది. తాను సినిమాల‌కు దూర‌మై చాలా కాల‌మైనా అభిమానులు ఇప్ప‌టికీ త‌న‌పై అదే ప్రేమ, ఆద‌ర‌ణ‌ను చూపిస్తుండ‌టం అదృష్టంగా భావిస్తున్నాన‌ని మంచు మ‌నోజ్ ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆ ప్రేమ‌ను ఈ సినిమాతో అంద‌రికీ తిరిగి ఇవ్వ‌బోతున్న‌ట్లు మంచు మ‌నోజ్ ట్వీట్ చేశాడు. క్రేజీ ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచే క్రేజీ ఫిల్మ్ ఇద‌ని పేర్కొన్నాడు. మంచు మ‌నోజ్‌ పోస్ట్ చేసిన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ సినిమాకు వ‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. డైరెక్ట‌ర్‌గా అత‌డికి ఇదే తొలి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్‌ క‌థాంశంతో వాట్ ద ఫిష్ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు ప్రాధాన్య‌ముంటుంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపాడు.

కెన‌డా, టొరంటోల‌లో 75 రోజుల పాటు షూటింగ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు డిఫ‌రెంట్ లాంగ్వేజెస్‌లో షూట్ చేయ‌నున్న ఈ సినిమాను పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

కాగా చివ‌ర‌గా 2017లో ఒక్క‌డు మిగిలాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు మంచు మ‌నోజ్‌. ఆ త‌ర్వాత ఇది నా ల‌వ్ స్టోరీ, ఆప‌రేష‌న్ 2019 సినిమాల్లో గెస్ట్ రోల్ చేశాడు. అహం బ్ర‌హ్మాస్మి పేరుతో ఓసినిమాను అనౌన్స్ చేసినా క‌రోనా కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.