తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత భైరవం మూవీతో మంచు మనోజ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 30న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. భైరవం రిలీజ్ సందర్భంగా ఈ సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒదిదుడుకుల గురించి మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఒక సినిమా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిశాడు. . డైరెక్టర్ విజయ్ నన్ను కలవాలని అనుకుంటున్నాడని చెప్పాడు.ఆ తర్వాత డైరెక్టర్ విజయ్ నన్ను కలిసి భైరవం కథ గురించి చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఇమ్మీడియట్ గా ఓకే చేశాను. డిఫరెంట్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా మూవీగా భైరవం ఆకట్టుకుంటుంది.
ఇందులో గజపతి వర్మ గా నేను క నిపిస్తా. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. చాలా ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ గా ఉంటుంది. భైరవం మూవీ తప్పకుండా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.ఇందులో నా తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ పాత్రలకు సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరి స్క్రీన్ స్పేస్ వారిదే, ప్రతి ఒక్కరూ ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా రాశారు.
బెల్లంకొండ శ్రీనివాస్ నాకు తమ్ముడి లాంటివాడు. రోహిత్ నాకు మంచి ఫ్రెండ్. భైరవం సినిమాతో మా మధ్య బాండింగ్ మరింత పెరిగింది. నా పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా షూటింగ్ కి ఇబ్బంది రాకుండా చూస్తుకున్నా. ఈ సినిమాలో సాంగ్ చేస్తున్న సమయంలో నారా రోహిత్ కుటుంబంలో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయన ఆ బాధలోనే షూటింగుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పాటని ఫినిష్ చేశారు.
నమ్మిన వాళ్లను బాగా చూసుకోవడం, పదిమందికి హెల్ప్ చేయడం నాన్న నుంచే నేర్చుకున్నా. ఎన్నో కష్టాలను దాటుకొని పైకి వచ్చారు. నాన్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. నాకు మా ఫాదరే హీరో.
భైరవం కంటే ముందు అహం బ్రహ్మాస్మి మూవీతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వద్దామని అనుకున్నా. అయితే అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఐతే దేవుడు ఇలా ప్లాన్ చేశాడు. భైరవం మిరాయి ఇవన్నీ కూడా దేవుడు ప్లాన్ చేసిన సినిమాలే అనుకుంటున్నాను.తొమ్మిదేళ్లయింది సినిమాలకి దూరమై. కొన్ని అనివార్య కారణాల వల్ల యాక్టింగ్‌కు బ్రేక్ తీసుకున్నాను. భైరవంతో సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకులు ముందుకు వస్తుండటంతో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యాను అని మనోజ్ అన్నాడు
ఈ బర్త్ డే నుంచి నాకు ఒక కొత్త లైఫ్ మొదలు కాబోతోంది. బర్త్ డే స్టార్ట్ అవ్వకముందే ఏ స్టేజ్ అయితే మిస్ అయ్యానో అదే దేవుడు మళ్లీ నాకు ఇచ్చాడు. ఇక నుంచి సినిమాలపైనే ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నా. భవిష్యత్తులో కొత్త రకం సినిమాలు చేయాలని వుంది ప్రస్తుతం మిరాయితో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నా అని మనోజ్ చెప్పాడు.
సంబంధిత కథనం