Manchu Manoj in OTT: ఫ్యాన్స్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్న మంచు మనోజ్.. ఓటీటీలోకి ఎంట్రీ-manchu manoj in ott ustaad reality show in etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Manoj In Ott: ఫ్యాన్స్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్న మంచు మనోజ్.. ఓటీటీలోకి ఎంట్రీ

Manchu Manoj in OTT: ఫ్యాన్స్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్న మంచు మనోజ్.. ఓటీటీలోకి ఎంట్రీ

Hari Prasad S HT Telugu
Dec 06, 2023 05:37 PM IST

Manchu Manoj in OTT: మరో టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఉస్తాద్ పేరుతో రాబోతున్న సరికొత్త షోతో ఫ్యాన్స్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అతడు అంటున్నాడు.

ఈటీవీ విన్ ఓటీటీలో రాబోతున్న మంచు మనోజ్ ఉస్తాద్
ఈటీవీ విన్ ఓటీటీలో రాబోతున్న మంచు మనోజ్ ఉస్తాద్

Manchu Manoj in OTT: సినిమా స్టార్లందరూ ఓటీటీల వైపు చూస్తున్న ఈ కాలంలో మరో టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ కూడా ఈటీవీ విన్ (ETV Win)లో ఓ షో చేయబోతున్నాడు. ఈ షో పేరు ఉస్తాద్. గతంలోనే ఈ షో అనౌన్స్ చేయగా.. తాజాగా ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో షోకి సంబంధించి ఓ హింట్ ఇచ్చారు.

ఇప్పటికే విశ్వక్‌సేన్ లాంటి యువ హీరోలతోపాటు బాలకృష్ణలాంటి సీనియర్ కూడా ఆహా ఓటీటీలో స్పెషల్ షోలు చేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా ఉస్తాద్ పేరుతో ఓ కొత్త చేయబోతున్నాడు. ఈ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఆసక్తి రేపేలా ఉంది. ఇదొక సెలబ్రిటీ గేమ్ షో.

ఫ్యాన్స్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మనోజ్ చెప్పడం విశేషం. "నేను మీ మనోజ్. నా కథ మీరు రాసుకున్నది, నా రాక మీరు పిలుస్తున్నది. ప్రతి హీరోనీ నడిపించే సైన్యం ఫ్యాన్స్. ప్రతి స్టారూ సంపాదించుకునే ధైర్యం ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ కి నేను ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్టే ఉస్తాద్" అని మనోజ్ చెబుతున్న ప్రోమో అదిరిపోయింది. ఈ షోలో ఎంతో మంది సెలబ్రిటీలు వినోదం పంచడానికి రానున్నారు.

అతి పెద్ద షోతో రాకింగ్ స్టార్ తిరిగి వస్తున్నాడంటూ ఈ ప్రోమో సాగిపోయింది. అభిమానులకు, అభిమానుల చేత, అభిమానుల కోసం.. అనే నినాదంతో ఈ కొత్త గేమ్ షో రానుంది. ఈ ఉస్తాద్ షోకి ర్యాంప్ ఆడిద్దాం అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తెలుగు ఓటీటీల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం ఆరాటపడుతున్న ఈటీవీ విన్ ఈ కొత్త షోపై ఆశలు పెట్టుకుంది.

హీరో మనోజ్ ర్యాంప్ ఆడించడానికి రెడీ.. మరి మీరు రెడీనా.. ప్రోమో ర్యాంపేజ్.. ఇక ఎపిసోడ్ ర్యాంప్ అంతే.. అనే క్యాప్షన్ తో ఈ కొత్త షో వివరాలను ఈటీవీ విన్ సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది. ఈటీవీ విన్ ఓటీటీని సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి ఏడాదికి రూ.365 చెల్లిస్తే చాలు.

Whats_app_banner