Manchu Family: మంచు ఫ్యామిలీలో విభేదాలు - మంచు మనోజ్‌పై దాడి చేసిన మోహన్‌బాబు
Manchu Family: మంచు ఫ్యామిలీలో గొడవలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనపై తండ్రి మోహన్‌బాబు దాడి చేసినట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ ఫిర్యాదుచేసినట్లు సమాచారం. మనోజ్‌పై కూడా మోహన్‌బాబు పోలీస్ కేసు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది
Manchu Family: మంచు ఫ్యామిలీలో విభేదాలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మోహన్‌బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఆస్తి వ్యవహారాల్లోనే తండ్రీ కొడుకుల మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
తన పై తండ్రి మోహన్‌బాబు దాడి చేశాడని మంచు మనోజ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన భార్య మౌనికపై మోహన్‌బాబు దాడిచేశాడని మనోజ్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. మనోజ్ తనపై దాడిచేసినట్లు మోహన్‌బాబు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
అభిప్రాయభేదాలు..
మోహన్‌బాబు వారసులు మనోజ్, విష్ణు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్ పెళ్లి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. మనోజ్ పెళ్లిలో విష్ణు ఎక్కువగా కనిపించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
విష్ణు దాడి...
ఆ తర్వాత మనోజ్ సంబంధీకులపై విష్ణు దాడిచేసిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోను స్వయంగా మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ తర్వాత డిలేట్ చేశాడు. ఈ గొడవల వల్ల మంచు ఫ్యామిలీ రెండుగా విడిపోయినట్లు సమాచారం. మోహన్‌బాబు, విష్ణు ఒకటిగా కనిపిస్తున్నారు...మనోజ్, లక్ష్మి క్లోజ్‌గా ఉంటున్నట్లు చెబుతోన్నారు.
అవన్నీ అసత్యాలే..
మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం లేదంటూ మంచు ఫ్యామిలీ ప్రకటించింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఊహాజనితమైన ప్రచారాలు జరుగుతున్నాయని, అవన్నీ అసత్యాలేనని మంచు ఫ్యామిలీ తెలిపింది. ఎవిడెన్స్ లు లేకుండా అసత్య ప్రచారాలను చేయద్దంటూ ప్రకటించింది.
కన్నప్ప....
ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప సినిమాలో నటిస్తోన్నాడు. మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆయన తనయుడు విష్ణు స్వయంగా ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది. కన్నప్ప మూవీలో ప్రభాస్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్ గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు.
టాపిక్