టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైవరం సినిమాపై మంచి హైప్ ఉంది. ఈ మల్టీస్టారర్ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ మూవీని హైవోల్టేజ్ యాక్షన్‍తో తెరకెక్కించారు. ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో భైరవం సినిమా ట్రైలర్ నేడు (మే 18) రిలీజైంది.
భగవద్గీతలో అర్జుడితో శ్రీకృష్ణుడు చెప్పిన ‘పవిత్రాణాయ సాధూనం’ శ్లోకంతో భైరవం సినిమా ట్రైలర్ మొదలైంది. మంచు మనోజ్, సాయిశ్రీనివాస్, నారా రోహిత్ వాయిస్‍తో ఈ శ్లోకం ఉంది. ఓ దేవాలయం షాట్స్ కనిపిస్తుంటాయి. ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడేందుకు దేవుడే ఏదో రూపంలో వస్తాడనే డైలాగ్ తర్వాత సాయి శ్రీనివాస్ ఎంట్రీ ఉంది.
వారాహి అమ్మవారి భూములను కాజేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి రంగంలోకి దిగుతాడు. ఆ మంత్రిని అడ్డుకొని దేవాలయ భూములను కాపాడేందుకు ముగ్గురు కలిసి పోరాడతారు. విలన్లను ఉతిరి ఆరేస్తారు. పవర్ ఫుల్ డైలాగ్‍లు కూడా అదిరిపోయాయి.
బైవరం ట్రైలర్ పవర్‌ఫుల్‍గా సాగింది. హైవోల్టేజ్ యాక్షన్‍తో సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్ అదరగొట్టారు. డైలాగ్‍లు కూడా శక్తివంతంగా ఉన్నాయి. మహాభారతం రిఫరెన్స్‌లతో ఎక్కువ డైలాగ్స్ సాగాయి. “ఇన్నాళ్లు ఈ గజపతి తగ్గడం చూశావ్. ఇకపై నెగ్గడం చూస్తావ్” అని మనోజ్ డైలాగ్ ఉంది. ఇది అతడి పర్సనల్‍లైఫ్‍కు కూడా కనెక్ట్ చేసి రాసిన డైలాగ్‍లా అనిపిస్తోంది.
యాక్షన్‍తో భైరవం ట్రైలర్లో డైరెక్టర్ విజయ్ కనకమేడల మరోసారి మార్క్ చూపించారు. సీరియస్ స్టోరీతో ఇంటెన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్‍ను రగెడ్ లుక్‍తో అదిరిపోయేలా చూపించారు. ముగ్గురి పాత్రలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. త్రిశూలాలతో శ్రీనివాస్ ఫైట్ చేసే లాస్ట్ షాట్ ట్రైలర్లో ఆకట్టుకుంది. ఇది సినిమాలో క్లైమాక్స్‌లో ఉండనుందని అర్థమవుతోంది. శ్రీచరణ్ పాకాల బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్సీతో సాగింది. ఈ మూవీకి హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ చేశారు.
భైరవం సినిమాలో జయసుధ, అదితి శంకర్, ఆనంది, దివ్య, అజయ్, రాజా రవీంద్ర, శరత్ లోహితస్వ, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని కేకే రాధామోహన్ నిర్మించారు.
సంబంధిత కథనం