Manchu Lakshmi: హైదరాబాద్‌లో అయితే నన్ను చూస్తే లేచి నిలబడతారు.. కానీ ఇక్కడ మాత్రం..: మంచు లక్ష్మి
Manchu Lakshmi: హైదరాబాద్ వదిలి ముంబై వెళ్లిన మంచు లక్ష్మి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో అయితే తనను చూడగానే లేచి నిలబడతారని, ముంబైలో మాత్రం తనను తాను పరిచయం చేసుకోవాల్సి వస్తోందని ఆమె చెప్పింది.
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్ కు పరిచయమైన నటి మంచు లక్ష్మి పదేళ్లు హైదరాబాద్ లో ఉన్న తర్వాత ఇప్పుడు ముంబైకి మకాం మార్చింది. కొత్త ప్రాంతం, కొత్త భాష, కొత్త అవకాశాలు.. మొత్తంగా తన కొత్త ప్రపంచంపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
సాధారణంగా మంచు లక్ష్మి ఏం మాట్లాడినా, ఏ పని చేసినా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి. ఓ సినిమా కుటుంబం నుంచి వచ్చిన మంచు లక్ష్మిని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేకుండానే గుర్తు పడతారు. కానీ ముంబైలో మళ్లీ మొదటి నుంచీ తన కెరీర్ మొదలు పెట్టాల్సి ఉంటుంది.
దీనిపై ఆమె స్పందిస్తూ.. హైదరాబాద్ లో తాను ఎక్కడికి వెళ్లినా లేచి నిలబడతారని, ఇక్కడ తనను తాను మరోసారి పరిచయం చేసుకోవాల్సి వస్తోందని చెప్పింది. అయితే అలాంటి సవాళ్లనే తాను ఇష్టపడతానని, ఒకే చోట ఎప్పటికీ ఉండిపోవడం తనకు ఇష్టం ఉండదని ఆమె స్పష్టం చేసింది. రానా తన బిజినెస్ గురించి మాట్లాడుతున్న సమయంలో తాను కూడా ఇక హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని అనుకున్నట్లు చెప్పింది.
ఆ పని రకుల్ చేసి పెట్టింది..
ముంబైలాంటి మహా నగరంలో ఎలాంటి వ్యక్తికైనా ఇల్లు దొరకడం చాలా కష్టం. కానీ తనకు మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ పని చేసి పెట్టినట్లు లక్ష్మి చెప్పింది. తాను ముంబైలో అడుగుపెట్టక ముందే ఆమె సుమారు 100 అపార్ట్‌మెంట్ల వరకూ చూసిందని, తాను వెళ్లిన వారం రోజుల్లో అందులో బెస్ట్ అనుకున్నదాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిపింది.
"ఇది నాకు నిజమైన ఛాలెంజ్. హిందీ మాట్లాడటం, ఆ భాషలోనే షోలు చేయాల్సి రావడం. నేను అమెరికన్ షోలు చేశాను. తర్వాత సౌత్ సినిమాలు చేశాను. కానీ నాకు చాలా త్వరగా బోర్ వచ్చేస్తుంది. తర్వాత ఏంటన్న కుతూహలం నాలో ఎప్పుడూ ఉంటుంది. ఒక చోటు ఎక్కువ కాలం ఉండకూడదు. హైదరాబాద్ ఎలా వదిలేస్తావ్ అని అందరూ నన్ను అడిగారు. నేను వెళ్తే లేచి నిల్చొంటారు. ఇప్పుడు కొత్త ప్లేస్ లోకి వెళ్లి నిన్ను నువ్వు మళ్లీ పరిచయం చేసుకుంటావా అన్నట్లుగా నన్ను చూసేవాళ్లు" అని ఆ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చెప్పింది.
టాపిక్