Manchu Lakshmi: ఐదు భాష‌ల్లో రిలీజ్ కానున్న మంచుల‌క్ష్మి డివోష‌న‌ల్ మూవీ - రెండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ!-manchu lakshmi devotional movie adiparvam release in five languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Lakshmi: ఐదు భాష‌ల్లో రిలీజ్ కానున్న మంచుల‌క్ష్మి డివోష‌న‌ల్ మూవీ - రెండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ!

Manchu Lakshmi: ఐదు భాష‌ల్లో రిలీజ్ కానున్న మంచుల‌క్ష్మి డివోష‌న‌ల్ మూవీ - రెండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ!

Manchu Lakshmi: మంచు ల‌క్ష్మి లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఆదిప‌ర్వం మూవీ ఐదు భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. డివోష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీకి సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

మంచు ల‌క్ష్మి ఆదిప‌ర్వం మూవీ

Manchu Lakshmi: మంచుల‌క్ష్మి లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఆదిప‌ర్వం మూవీ ఐదు భాష‌ల్లో థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 1974 నుంచి 1992 మ‌ధ్య కాలంలో జ‌రిగే పీరియాడిక‌ల్ డివోష‌న‌ల్ డ్రామా ఆదిప‌ర్వం తెర‌కెక్కుతోంది.

ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యథార్థ సంఘటనల నుండి అల్లుకున్నక‌థ‌తో ఆదిప‌ర్వం మూవీని తెర‌కెక్కిస్తోన్నామ‌ని సంజీవ్ మేగోటి అన్నాడు. ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలికి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? ఆ భక్తురాలిని దుష్ట శక్తుల బారి నుంచి క్షేత్ర‌పాల‌కుడు ఎలా కాపాడాడు అన్న‌ది ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు సినిమాలో థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

సెన్సార్ పూర్తి...

ఆదిప‌ర్వం సినిమాను తెలుగుతో పాటు క‌న్న‌డ‌, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆదిప‌ర్వం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ డివోష‌న‌ల్ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆదిప‌ర్వం ద్వారా రెండు వందలమందికి పైగా కొత్త నటీనటులు టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు. ఆదిప‌ర్వం సినిమాలో మంచులక్ష్మితో పాటు శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

రెండేళ్ల త‌ర్వాత‌…

మంచు ల‌క్ష్మి తెలుగులో సినిమా నాలుగేళ్లు దాటిపోయింది.2020లో వ‌చ్చిన మా వింత గాథ వినుమా సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఆ త‌ర్వాత 2022లో వ‌చ్చిన పిట్ట‌క‌థ‌లు ఆంథాల‌జీ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పొలిటిక‌ల్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించింది. ఆదిప‌ర్వంతో రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

య‌క్షిణిలో ఇంపార్టెంట్ రోల్‌...

ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు వెబ్‌సిరీస్‌ల‌పై దృష్టిపెట్టింది మంచు ల‌క్ష్మి. బాహుబ‌లి మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న య‌క్షిణి అనే వెబ్‌సిరీస్‌లో మంచు ల‌క్ష్మి ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ సోషియో ఫాంట‌సీ సిరీస్‌కు తేజా మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.ఈ సిరీస్‌లో మంచు ల‌క్ష్మితో పాటు వేదిక‌, అజ‌య్‌, రాహుల్ విజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త్వ‌ర‌లో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో య‌క్షిణి సిరీస్ రిలీజ్ కాబోతోంది.

అలాగే తెలుగులో తండ్రి మోహ‌న్‌బాబుతో క‌లిసి తొలిసారి అగ్నిన‌క్ష‌త్రం అనే యాక్ష‌న్ సినిమా చేస్తోంది మంచు ల‌క్ష్మి. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ పెట్టిన మంచు ల‌క్ష్మి కొన్నాళ్ల క్రిత‌మే ముంబైకి షిఫ్ట్ అయ్యింది.

గుండెల్లో గోదారి....

తెలుగులో అన‌గ‌న‌గా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, దొంగాట‌, వైఫ్ ఆఫ్ రామ్‌తో సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది మంచు ల‌క్ష్మి. కొన్ని సినిమాల‌ను ప్రొడ్యూస్ చేసింది. గ‌త ఏడాది మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన మాన్‌స్ట‌ర్‌తో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో లెస్బియ‌న్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో న‌టించింది.