Turbo Twitter Review: బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో మలయాళం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్నాడు అగ్ర హీరో మమ్ముట్టి. భ్రమయుగంతో కొత్త ప్రయోగం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మమ్ముట్టి తాజాగా టర్బో మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్‌బీ శెట్టి, టాలీవుడ్ యాక్టర్ సునీల్ విలన్స్‌గా నటించారు. వైశాఖ్ దర్శకత్వం వహించాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ గురువారం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
టర్బో మూవీ ఓవర్‌సీస్ షోస్‌కు పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా యాక్షన్ మూవీ ఇదని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. టర్బో జోస్ పాత్రలో మమ్ముట్టి అదరగొట్టాడని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మాస్ రోల్‌లో మమ్ముట్టి దుమ్మురేపాడని అంటున్నారు. టర్బోలో మమ్ముట్టి హీరోయిజం, ఎలివేషన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయని చెబుతోన్నారు.
విలన్‌గా రాజ్ బీ శెట్టి యాక్టింగ్‌తో ఇరగదీశాడని కామెంట్స్ చేస్తున్నారు. అతడి విలనిజం, ఎలివేషన్స్‌మమ్ముట్టి, రాజ్ బీ శెట్టి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని అంటున్నారు.
లాస్ట్ 30 మినిట్స్ మాత్రం టర్బో మూవీ పిచ్చెక్కిస్తుందని, యాక్షన్ సీన్స్, ట్విస్ట్‌లు సర్‌ప్రైజ్ చేస్తాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. టాలీవుడ్ కమెడియన్ సునీల్ రోల్ సినిమాలో కొత్తగా ఉంటుందని అంటున్నారు. డిఫరెంట్ రోల్‌తో సునీల్ మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వడం బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతోన్నారు.
టర్బో యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయని అంటున్నారు. మమ్ముట్టి స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. ప్రొడక్షన్ వాల్యూస్‌లో రాజీపడకపోవడంతో ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
రొటీన్ స్క్రిప్ట్ టర్బోకు మైనస్‌గా మారిందని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాల శైలిలో యాక్షన్, ఎలివేషన్స్‌తో డైరెక్టర్ నెట్లుకొచ్చాడని అంటున్నారు. బీజీఎమ్ ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయిలో లేదని ట్వీట్స్ చేస్తున్నారు.
మమ్ముట్టి హీరోగా నటించిన గత సినిమాలు కన్నూర్ స్క్వాడ్, కాథల్ ది కోర్, భ్రమయుగం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. కాథల్ ది కోర్‌లో స్వలింగసంపర్కుడిగా, భ్రమయుగంలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అసమాన నటనతో మమ్ముట్టి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాడు. తెలుగులో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మమ్ముట్టి కనిపించాడు. ప్రస్తుతం మరో నాలుగు మలయాళం సినిమాల్లో హీరోగా నటిస్తోన్నాడు మమ్ముట్టి.