OTT Mammootty Thriller Movies: మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి వరుసబెట్టి సినిమాలు చేస్తూనే ఉంటాడు. వాటిలో కొన్ని థ్రిల్లర్ మూవీస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఆ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో భ్రమయుగం, రోర్షాక్, కన్నూర్ స్క్వాడ్ లాంటి సినిమాలు ఉన్నాయి.
మలయాళం ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరుగాంచిన హీరో మమ్ముట్టి. ఇప్పటికే 400కుపైగా సినిమాల్లో నటించాడు. 73 ఏళ్ల వయసులోనూ ఇంకా నటిస్తూనే ఉన్నాడు. మరి అతడు నటించిన సినిమాల్లో బెస్ట్ అనిపించే 5 థ్రిల్లర్ మూవీస్ ఏంటో చూద్దాం.
భ్రమయుగం 17వ శతాబ్దపు కేరళ బ్యాక్‌డ్రాప్ లో సాగే మూవీ. ఇందులో తేవన్ అనే పాణన్ కులానికి చెందిన జానపద గాయకుడు బానిసల మార్కెట్ నుండి తప్పించుకుని ఒక రహస్యమైన భవనంలోకి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక దుష్ట శక్తి ఎదురవుతుంది. ఒక చీకటి రహస్యం బయటపడుతుంది. ఈ సినిమా ప్రాచీన కేరళలోని ఆధ్యాత్మిక సంప్రదాయాల నేపథ్యంలో సాగుతుంది. మమ్ముట్టి ఆ భవనం రహస్య యజమాని కోడుమోన్ పోట్టిగా నటించాడు.
కన్నూర్ స్క్వాడ్ సినిమాను నిజ జీవిత పోలీసు యూనిట్ ఆధారంగా రూపొందించారు. ఇందులో ఏఎస్ఐ జార్జ్ మార్టిన్, అతని టీమ్ వృత్తిపరమైన అనిశ్చితులు, నేరస్థులను పట్టుకోవడానికి వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు ఎలాంటివో చూపిస్తుంది. ఓ కేసులో నేరస్థులను గుర్తించడానికి కన్నూర్ స్క్వాడ్ దేశవ్యాప్తంగా చేసే ప్రయాణాన్ని, వారు ఎదుర్కొనే సవాళ్లు, అనిశ్చితులను మూవీలో చూడొచ్చు. ఈ మూవీలో మమ్ముట్టి ఏఎస్ఐ జార్జ్ మార్టిన్ పాత్రలో నటించాడు.
రోర్షాక్ 2022లో విడుదలైన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇందులో మమ్ముట్టి నటించాడు. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే ఎన్నారై వ్యాపారవేత్త లూక్ ఆంథోనీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ మూవీ స్టోరీని చెప్పే తీరు ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను పంచుతుంది. తెలుగులోనూ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మున్నరియిప్పు మూవీ అంజలి అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ స్టోరీ. తాను చేయని నేరానికి సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్న సీకే రాఘవన్ అనే ఖైదీ కథ పట్ల ఆమె ఆకర్షితురాలవుతుంది. అతని ఆత్మకథను రాయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఖైదీ సీకే రాఘవన్ పాత్రలో మమ్ముట్టి నటించాడు.
అబ్రహమింతే సంతతికల్ ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో పోలీసు అధికారి డెరిక్ అబ్రహం పాత్రలో మమ్ముట్టి నటించాడు. అతని సోదరుడు ఫిలిప్ (అన్సన్ పాల్) ఓ హత్య కేసులో అనుమానితుడిగా ఉంటాడు. అప్పుడు తన విధి, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అతనికి ఏర్పడుతుంది. తన వృత్తి, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయే ఓ పోలీస్ అధికారి పాత్రను కళ్లు కట్టేలా ఈ మూవీ చూపిస్తుంది.
సంబంధిత కథనం