Political Thriller OTT: ఓటీటీలోకి వచ్చిన మమ్ముట్టి మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - 18 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్
Thriller OTT: మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నస్రాని ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2007లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 18 ఏళ్ల తర్వాత ఓటీటీలో రిలీజ్ కావడం గమనార్హం.
Thriller OTT: మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళం మూవీ నస్రాని ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. 2007లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు 18 ఏళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
పొలిటికల్ థ్రిల్లర్...
పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన నస్రాని మూవీకి జోషి దర్శకత్వం వహించాడు. కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో విమలా రామన్ హీరోయిన్‌గా నటించింది. కళాభవన్ మణి, బీజుమీనన్, ముక్త కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీ అంశాలకు పొలిటికల్, లవ్ స్టోరీని జోడించి దర్శకుడు జోషి ఈ సినిమాను తెరకెక్కించాడు. మమ్ముట్టి యాక్టింగ్‌తో పాటు ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి.తెలుగులోనూ అజాత శత్రువు పేరుతో నస్రాని డబ్ అయ్యింది.
నస్రాని కథ ఇదే...
డేవిడ్ అలియాస్ డీకే నర్సరీ బిజినెస్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి సారాను ప్రాణంగా ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లిచేసుకోవాలని ఆశపడతారు. పెద్దలు కూడా వీరి ప్రేమకు అంగీకరిస్తారు. అంతా సాఫీగా సాగుతోన్న టైమ్‌లో సారా చెల్లెలు ముక్త హత్యకు గురువుతుంది. ఈ మర్డర్ కేసు డేవిడ్‌పై పడటంతో జైలుకు వెళతాడు. పదేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన డేవిడ్ తనపై పడిన నిందను పొగొట్టుకోవడానికి ఏం చేశాడు? అసలు ముక్తను చంపింది ఎవరు? డేవిడ్‌ను అపార్థం చేసుకున్న సారా నిజాన్ని ఎలా తెలుసుకుంది అన్నదే ఈ మూవీ కథ.
పదిహేను సినిమాలు...
మమ్ముట్టి, డైరెక్టర్ జోషి కాంబినేషన్‌లో పదిహేనుకుగాపై సినిమాలు వచ్చాయి. ఎక్కువగా యాక్షన్ సినిమాలే వీరిద్దరి కాంబోలో తెరకెక్కడం గమనార్హం. న్యూఢిల్లీ, శ్యామ, మహాయానం, తంత్రం, లైలా ఓ లైలా, ఆంటోనీతో పాటు పలు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
మమ్ముట్టి...
గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు చేస్తోన్నాడు మమ్ముట్టి. గత ఏడాది భ్రమయుగం, టర్బో సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ఈ ఏడాది డొమినిక్ సినిమా చేశాడు. మిస్టరీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు.
మమ్ముట్టి హీరోగా నటించిన బజూక ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. బజూకతో పాటు మరో రెండు సినిమాలు చేస్తోన్నాడు మమ్ముట్టి.
సంబంధిత కథనం