Bazooka Trailer: మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ బజూకా ట్రైలర్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో మలయాళ మెగాస్టార్
Bazooka Trailer: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న బజూకా మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుండగా.. బుధవారం (మార్చి 26) ట్రైలర్ రిలీజ్ చేశారు. మమ్ముట్టి స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు.
Bazooka Trailer: మమ్ముట్టి నటించిన బజూకా ట్రైలర్ బుధవారం (మార్చి 26) విడుదలైంది. మోహన్‌లాల్ నటించిన 'తుడరుమ్', నస్లెన్ నటించిన ‘ఆలప్పుజ జింఖానా’ ఆసక్తికరమైన ట్రైలర్‌ల తర్వాత.. ఇప్పుడు మమ్ముట్టి బజూకా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీనో డెన్నిస్ దర్శకత్వం వహించిన బజూకా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా వచ్చిన ట్రైలర్ యాక్షన్ తో అదిరిపోయింది. మమ్ముట్టి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.
బజూకా ట్రైలర్‌లో మమ్ముట్టి
మమ్ముట్టి ఈ చిత్రంలో వినోద్ మీనన్‌గా కనిపించనున్నాడు. ఇది ఒక గేమ్ థ్రిల్లర్‌గా మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎంట్రీతో మొదలైంది. అతను పోలీసు యూనిఫామ్‌లో వచ్చి.. తలుపు తెరవమని ఓ రౌడీ గ్రూప్ ను అడుగుతాడు. అతడు కొచ్చి నగర ఏసీపీ బెంజమిన్ జోషువా పాత్రలో నటించాడు. అతని కింద మంచి శిక్షణ పొందిన పోలీసు ఆఫీసర్లు ఉంటారు.
ఆ తర్వాత మమ్ముట్టి పాత్ర పరిచయం అవుతుంది. ఇతడో మిస్టర్ నోబడీ కానీ సమ్‌బడీ అంటూ మమ్ముట్టి పాత్ర గురించి గౌతమ్ మేనన్ పాత్ర చెబుతుంది. అతడు చెప్పినట్లుగా క్లాసీ, స్లీక్ లుక్ లో మమ్ముట్టి చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఆ తర్వాత ట్రైలర్ మొత్తం యాక్షన్ మోడ్ లో సాగుతుంది.
బజూకా మూవీ గురించి..
బజూకా మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 73 ఏళ్ల వయసులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కనిపించడం విశేషం. కొన్నేళ్లుగా విలక్షణ పాత్రల్లో కనిపిస్తున్న మమ్ముట్టి.. ఈ బజూకాతో ప్రేక్షకులను మరింత మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 2 నిమిషాల 32 సెకన్ల నిడివి ఉన్న బజూకా ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచేసింది.
బజూకా మూవీలో మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మేనన్‌తో పాటు బాబు ఆంటోనీ, నీతా పిళ్లై, షరఫ్ యు దీన్, జగదీశ్, సిద్ధార్థ్ భరతన్ కూడా నటించారు. షైన్ టామ్ చాకో, స్ఫదికం జార్జ్, గాయత్రి అయ్యర్, దివ్య పిళ్లై, ఐశ్వర్య మీనన్, షమ్మీ తిలకన్ ఈ సినిమాలో వివిధ పాత్రల్లో నటించారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ బజూకా మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం