Malikappuram Movie Review: మాలికాపురం మూవీ రివ్యూ - ఉన్ని ముకుంద‌న్ సినిమా ఎలా ఉందంటే-malikappuram movie telugu review unni mukundan movie review ott review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Malikappuram Movie Telugu Review Unni Mukundan Movie Review Ott Review

Malikappuram Movie Review: మాలికాపురం మూవీ రివ్యూ - ఉన్ని ముకుంద‌న్ సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Feb 17, 2023 08:27 AM IST

Malikappuram Movie Review: ఉన్నిముకుంద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం మాలికాపురం ఇటీవ‌లే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. భ‌క్తి ప్ర‌ధాన క‌థాంశంతో రూపొందిన ఈసినిమా ఎలా ఉందంటే...

మాలికాపురం మూవీ
మాలికాపురం మూవీ

Malikappuram Movie Review: భాగ‌మ‌తి, య‌శోద వంటి సినిమాల‌తో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు మ‌ల‌యాళ హీరో ఉన్నిముకుంద‌న్‌. అత‌డు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళ మూవీ మాలికాపురం తెలుగులో అదే పేరుతో అనువాద‌మైంది. తెలుగు వెర్ష‌న్‌ను థియేట‌ర్ల‌లో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ సినిమా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. భ‌క్తి ప్ర‌ధాన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు విష్ణు శిశి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Malikappuram Story -ష‌న్ను శ‌బ‌రిమ‌ల క‌ల‌

ష‌న్ను (దేవ‌నంద‌) ఎనిమిదేళ్ల చిన్నారి. అయ్య‌ప్ప భ‌క్తురాలు. శ‌బ‌రిమ‌ల వెళ్లాల‌న్న‌ది ఆమె క‌ల‌. కూతురిని శ‌బ‌రిమ‌ల తీసుకెళ్తాన‌ని తండ్రి అజ‌య్ మాటిస్తాడు. కానీ అప్పుల‌ బాధ కార‌ణంగా అవ‌మానాలు భ‌రించ‌లేక‌ అజ‌య్‌ ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. త‌న క్లాస్‌మేట్ బుజ్జితో క‌లిసి క‌ళ్యాణి శ‌బ‌రిమ‌ల వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటుంది.

ష‌న్నును కిడ్నాప్ చేయాల‌ని ఓ రౌడీ ప్ర‌య‌త్నిస్తుంటాడు. అత‌డి నుంచి ష‌న్ను, బుజ్జిల‌ను అయ్య‌ప్పన్‌ (ఉన్ని ముకుంద‌న్‌) కాపాడుతాడు. ఆ చిన్నారులిద్ద‌రిని శ‌బ‌రిమ‌ల తీసుకెళ్తాన‌ని మాటిస్తాడు. ఆ మాట‌ను అత‌డు నిల‌బెట్టుకున్నాడా? అయ్య‌ప్ప‌న్ ఎవ‌రు? వారికి ఎందుకు స‌హాయం చేశాడు? అయ్య‌ప్ప‌న్‌ను క‌ళ్యాణి దేవుడిగా ఎందుకు భావించింది? అన్న‌దే(Malikappuram Movie Review) ఈ సినిమా క‌థ‌.

భ‌క్తి ప్ర‌ధాన క‌థ‌...

1990-2000 టైమ్‌లో భ‌క్తి ప్ర‌ధాన సినిమాలు ట్రెండ్ కొన‌సాగింది. అమ్మోరు, దేవుళ్లుతోపాటు భ‌క్తుల‌కు స‌హాయం చేసే దేవుడి క‌థాంశాల‌తో చాలా సినిమాలొచ్చాయి. ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. చాలా కాలం త‌ర్వాత ఈ జోన‌ర్‌లో వ‌చ్చిన సినిమా మాలికాపురం. భ‌క్తి ప్ర‌ధాన క‌థాంశానికి సోష‌ల్ మెసేజ్‌ను జోడించి ద‌ర్శ‌కుడు విష్ణు శ‌శి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాటి వారికి సాయ‌ప‌డే గుణం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ దేవుడితో స‌మాన‌మేన‌నే సందేశాన్ని ఇందులో చూపించారు.

అయ్య‌ప్ప మ‌హిమ‌ల‌ను...

శ‌బ‌రిమ‌ల ద‌ర్శించాల‌ని క‌ల‌గ‌న్న ఓ చిన్నారికి ప్ర‌యాణంలో ఎదురైన సంఘ‌ట‌న‌ల‌ను ఎమోష‌న‌ల్‌గా మాలికాపురం సినిమాలో ఆవిష్క‌రించారు. అంత‌ర్లీనంగా అయ్య‌ప్ప స్వామి మ‌హిమ‌ల‌ను, ఔన్న‌త్యాన్ని సినిమాలో చూపించారు.క‌న్నెస్వాముల‌ను మాలికాపురం అని ఎందుకు పిలుస్తారు? మ‌ధుర మీనాక్షి అమ్మ‌వారి చ‌రిత్ర ఏమిట‌న్న‌ది ఇందులో చూపించారు.

కిడ్నాప్ డ్రామా…

ష‌న్ను, అజ‌య్ పాత్ర‌ల ద్వారా తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూపిస్తూ సినిమా మొద‌ల‌వుతోంది. అప్పుల‌ను తీర్చ‌డానికి అజ‌య్ ప‌డే త‌ప‌న‌తో పాటు అయ్య‌ప్ప‌స్వామి ప‌ట్ల ష‌న్నులో ఉన్న భ‌క్తి భావాన్ని చూపించారు.

త‌న స్నేహితుడు బుజ్జితో క‌లిసి ష‌న్ను శ‌బ‌రిమ‌ల వెళ్లాల‌ని ఫిక్స్ కావ‌డంతో అక్క‌డి నుంచి ఆమెకు ఎదుర‌య్యే ప‌రిణామాల‌కు కిడ్నాప్ డ్రామాను జోడిస్తూ క‌మ‌ర్షియ‌లైజ్ చేశారు. చివ‌ర‌లో ష‌న్నుదేవుడు అనుకున్న అయ్య‌ప్ప పోలీస్ ఆఫీస‌ర్ అనే ట్విస్ట్ ఇవ్వ‌డం బాగుంది. చిన్నారుల‌కు అత‌డు ఎందుకు హెల్ప్ చేశాడ‌న్న‌ది చూపించారు.

ఉన్ని ముకుంద‌న్ క్యారెక్ట‌ర్ ప్ల‌స్‌…

అయ్య‌ప్ప‌గా హీరోయిజం, భ‌క్తిభావం క‌ల‌గ‌ల‌సిన పాత్ర‌లో ఉన్నిముకుంద‌న్ న‌టించాడు. అత‌డి క్యారెక్ట‌ర్‌లో క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ష‌న్నుగా దేవ నంద స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. బుజ్జిగా శ్రీప‌త్ యాన్ న‌వ్వించాడు.

Malikappuram Movie Review -క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో...

భ‌క్తి ప్ర‌ధాన సినిమాల్ని ఇష్ట‌ప‌డేవారిని మాలికాపురం మెప్పిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో చూస్తే మాత్రం సినిమాను ఎంజాయ్ చేయ‌డం క‌ష్ట‌మే.

IPL_Entry_Point