OTT Bold: 25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ మూవీ.. న్యూడ్, శృంగార సీన్లు, 7.4 రేటింగ్.. 8 భాషల్లో స్ట్రీమింగ్!-malena ott streaming on amazon prime with 8 languages after 25 years of its release oscar award monica bellucci movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold: 25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ మూవీ.. న్యూడ్, శృంగార సీన్లు, 7.4 రేటింగ్.. 8 భాషల్లో స్ట్రీమింగ్!

OTT Bold: 25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ మూవీ.. న్యూడ్, శృంగార సీన్లు, 7.4 రేటింగ్.. 8 భాషల్లో స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

Malena OTT Streaming After 25 Years: ఓటీటీలోకి 2000 కాలం నాటి బోల్డ్ మూవీ మలేనా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సుమారు 25 ఏళ్ల తర్వాత ఓటీటీ రిలీజ్ అయింది మలేనా చిత్రం. న్యూడ్, శృంగార సీన్లు ఉన్న మలేనాకు 7.4 రేటింగ్ ఉంది. 8 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న మలేనా ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ మూవీ.. న్యూడ్, శృంగార సీన్లు, 7.4 రేటింగ్.. 8 భాషల్లో స్ట్రీమింగ్!

Malena OTT Streaming After 25 Years: ఓటీటీలో ఈ మధ్య థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజులలోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అది ఎలాంటి కంటెంట్ సినిమా అయినా ఓటీటీ రిలీజ్‌కు ఎలాంటి అంతరాయం ఉండట్లేదు. అందుకే బోల్డ్, అడల్ట్ వంటి కంటెంట్ ఉన్న సినిమాలు సైతం ఎంచక్కా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

పాపులర్ హీరోయిన్

దీంతో 25 ఏళ్లకు ముందు థియేటర్లలో రిలీజ్ అయిన బోల్డ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమానే మలేనా. 2000 సంవత్సరం అక్టోబర్ 27న థియేట్రికల్ రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ మలేనా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి మలేనా సినిమాలో టైటిల్ రోల్ పోషించింది.

ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్

అప్పట్లో ఈ సినిమా సంచలనంగా మారింది. ఎందుకంటే మలేనాలో మోనికా బెల్లూచి న్యూడ్ సీన్స్, శృంగార సన్నివేశాలలో నటించింది. దీంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన మలేనా సినిమాకు లూసియానో విన్సెంజోని కథ అందించారు. గియుసేప్ టొర్నాటోర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.

రెండు ఆస్కార్ అవార్డ్స్

అలాగే, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మలేనా భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపుగా రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టింది ఈ మూవీ. అంతేకాకుండా 73వ అకాడమీ అవార్డ్స్‌లో ఈ శృంగార నాటక చిత్రం రెండు ఆస్కార్ అవార్డ్స్ కూడా సాధించింది. 2001లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో మలేనా ఆస్కార్ అవార్డ్స్ సొంతం చేసుకుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఇక ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.4 రేటింగ్ సాధించింది మలేనా మూవీ. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న మలేనా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా మలేనా ఓటీటీ రిలీజ్ అయింది. మార్చి 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 8 భాషల్లో మలేనా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇక్కడే కాస్తా ట్విస్ట్ పెట్టింది అమేజాన్ ప్రైమ్.

అద్దె చెల్లించి చూడాల్సిందే

మలేనా సినిమాను ఓటీటీలో చూడాలంటే రూ. 99 అద్దె చెల్లించి అమెజాన్ ప్రైమ్‌లో చూడాల్సిందే. రెంటల్ విధానంలో ప్రస్తుతం మలేనా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మార్చి 29 నుంచి మలేనాను ఫ్రీగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. అంటే, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ ఎలాంటి రెంట్ చెల్లించకుండా ఓటీటీలో మలేనా సినిమాను వీక్షించవచ్చు.

రెండు పాత్రల చుట్టూనే

ఇదిలా ఉంటే, మలేనా సినిమాలో మోనికా బెల్లూచితోపాటు 12 ఏళ్ల బాలుడు రెనాటో పాత్రలో గియుసేప్ సల్ఫారో మరో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా మొత్తం ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మలేనా, 12 ఏళ్ల రెనాటో మధ్య ఆకర్షణ, ప్రేమ వంటి సీన్లతో ఈ మూవీ సాగుతుంది. ఈ కథ అంతా 1940 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది.

పెద్దలకు మాత్రమే

ఆ కాలంలో ఒంటరి మహిళ పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలు, మెలిగే తీరు వంటి అంశాలతో మలేనాను చిత్రీకరించారు. కొన్ని ట్విస్ట్‌లు, న్యూడ్, శృంగార సన్నివేశాలు, డ్రామాతో నిండి ఉన్న ఈ బోల్డ్ మూవీ మలేనా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో పెద్దలు మాత్రం వీక్షించవచ్చు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం