2018 Movie Oscars Entry: ఇండియా నుంచి ఆస్కార్ బ‌రిలో 2018 మూవీ - తెలుగు సినిమాల‌కు నిరాశే!-malayalm blockbuster movie 2018 selected indias official entry for oscars 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Malayalm Blockbuster Movie 2018 Selected India's Official Entry For Oscars 2024

2018 Movie Oscars Entry: ఇండియా నుంచి ఆస్కార్ బ‌రిలో 2018 మూవీ - తెలుగు సినిమాల‌కు నిరాశే!

Nelki Naresh Kumar HT Telugu
Sep 27, 2023 02:16 PM IST

2018 Movie Oscars Entry: 2024 ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి మ‌ల‌యాళ మూవీ 2018 ఎంట్రీని ద‌క్కించుకున్న‌ది. బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ సినిమా పోటీప‌డ‌బోతున్న‌ది.

 2018 మూవీ
2018 మూవీ

2018 Movie Oscars Entry: మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 2018 ఆస్కార్‌ రేసులో నిలిచింది. ఆస్కార్‌ 2024 కోసం ఇండియా నుంచి అఫీషియ‌ల్ ఎంట్రీని ద‌క్కించుకున్న‌ది. 96వ ఆస్కార్స్‌లో బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ సినిమా పోటీప‌డ‌నుంది. ఫైన‌ల్ నామినేష‌న్స్‌లో ఈ సినిమాకు చోటు ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

ట్రెండింగ్ వార్తలు

2018లో కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో స‌ర్వైవ‌ల్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ 2018 మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో టొవినో థామ‌స్‌, కుంచ‌కోబోబ‌న్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, అసిఫ్ అలీ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా కొంత‌మంది జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి అన్న‌ది మ‌న‌సుల్ని క‌దిలించేలా ఈ సినిమాలో ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్‌.

మ‌ల‌యాళంలో మే 5న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా 200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా 2018 మూవీ స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమాను అదే పేరుతో నిర్మాత బ‌న్నీవాస్ రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన ఈ సినిమా ఈ ఏడాది నిర్మాత‌ల‌కు లాభాల్ని మిగిల్చిన డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

తెలుగు సినిమాల‌కు నిరాశే...

భార‌త్ నుంచి ఆస్కార్ ఎంట్రీ కోసం తెలుగు సినిమాలు ద‌స‌రా, బ‌ల‌గం పోటీప‌డ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ సినిమాల‌కు నిరాశే మిగిలింది. దేశ‌వ్యాప్తంగా వివిధ భాష‌ల నుంచి 22 సినిమాలు పోటీప‌డిన‌ట్లు స‌మాచారం. వాటిలో నుంచి 2018 సినిమాను అఫీషియ‌ల్‌గా జ్యూరీ ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలిసింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.